
Lungs : శ్వాస తీసుకోవడంలో ఇబ్బందా.. ఆయా ఇన్ఫెక్షన్లను నివారించాలంటే ఏం చేయాలో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
చలికాలం ప్రారంభం అయ్యిందంటే అలెర్జీలు కూడా మొదలవుతాయి. ఈ కాలంలో కాలుష్యం బాగా పెరిగిపోతుంది. ఫలితంగా ఊపిరితిత్తులు, శరీరానికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది.
కాలుష్య ప్రాంతాలు, బయటి వాతావరణంలో వ్యాయామాలు చేస్తే ఆయా కాలుష్య కారకాలు గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి అసౌకర్యం కలిగిస్తాయి.
ఈ క్రమంలోనే ఆరుబయట చల్లగా ఉన్న సమయాల్లో రన్నింగ్, వాకింగ్ లాంటి ఇతర అవుట్‌డోర్ ఎక్సర్‌సైజ్‌లు మంచిది కాదు.
మరోవైపు బయటకెళ్లి తిరిగి ఇంటికి తిరిగివచ్చాక చేతులు, ముఖం కడుక్కోవటం కీలకం. ఫలితంగా ఇన్ఫెక్షన్లను నివారించగలం.
బయట్నుంచి చాలా రకాల సూక్ష్మ క్రిములను ఇంటికి మోసుకొచ్చే ముప్పును అరికట్టేందుకు వీలవుతుంది. ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
details
గోరు వెచ్చని నీటితో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.
గోరువెచ్చని నీరు :
శీతాకాలంలో గోరువెచ్చని నీరు తాగితే జలుబు, ఫ్లూ నుంచి రక్షణ లబిస్తుంది.గొంతులోని ధూళి, కణాలను తొలగించి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.
మాస్క్‌లు అవసరమే :
బయటికి బయలుదేరే సమయంలో మాస్క్ ధరించడం, రోడ్లపై ప్రయాణం సమయంలో మాస్క్ ధరించటం కంపల్సరీ.
మాస్క్ ధరించడం వల్ల శ్వాస తీసుకునేటప్పుడు కాలుష్య కారకాలు ఉంటే ముక్కులోపలికి చేరవు. గాలి నాణ్యత లేమీ నుంచి ఉపశమనం పొందవచ్చు.
లెమన్ టీ, అల్లం ఛాయ్ :
ప్రతిరోజూ ఉదయాన్నే లెమన్ టీ, అల్లం ఛాయ్ తాగడం వల్ల శ్వాసకోశ అవయవాలల్లోని సూక్ష్మ క్రిములు నశిస్తాయి.
ఫలితంగా శరీరాన్ని ప్రభావితం చేసే ఇన్ఫెక్షన్ ను ఆపేందుకు వీలవుతుంది. దీంతో శరీరానికి పోషకాల సైతం అందుతాయి.
details
నీటిని ఆవిరి పట్టడం ద్వారా ముక్కులోని శ్లేష్మం తగ్గించుకోవచ్చు
ఆరుబయట వ్యాయామం వద్దు : నగరాల్లో అధిక కాలుష్య ప్రాంతాల్లో బయటి వాతావరణంలో వ్యాయామాలు చేస్తే కాలుష్య కారకాలు ముక్కు, గొంతులోకి చేరే ముప్పు పొంచి ఉంటుంది.
వేడి నీటిని ఆవిరి పట్టడం : శ్వాస తీసుకోవడంలో కలిగే ఇబ్బందులను వేడి నీటిని ఆవిరి పట్టడం ద్వారా తగ్గించుకోవచ్చు.
వ్యాయు కాలుష్యం బారిన పడే ప్రమాదం ఉన్నప్పుడు రోజు వారీగా ఆవిరి పట్టాలి. ఫలితంగా శరీరానికి ప్రయోజనాలు అందుతాయి.
గాలి శుద్ధి చేసే మొక్కల్నే నాటుకోవాలి : ఆరు బయట గానీ ఇంటి లోపల గానీ, ప్రాంగణం చుట్టూ ఇండోర్ గాలిని శుద్ధి చేసే మొక్కలనే పెంచుకోవాలి.
ఈ మేరకు స్నేక్ ప్లాంట్, వెదురు పామ్, డెవిల్స్ ఐవీ లాంటి మొక్కలను ఏర్పాటు చేసుకోవాలి.