LOADING...
Motivational: చాణక్యుడి నీతి.. ఇలా చేస్తే శత్రువైనా మీకు సలాం కొట్టాల్సిందే!
చాణక్యుడి నీతి.. ఇలా చేస్తే శత్రువైనా మీకు సలాం కొట్టాల్సిందే!

Motivational: చాణక్యుడి నీతి.. ఇలా చేస్తే శత్రువైనా మీకు సలాం కొట్టాల్సిందే!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2025
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

మనుషులు సాధారణంగా తమ జీవితాల్లో హోదా,ఆస్తి,గౌరవం వంటి వాటి కోసం తీవ్రంగా పోరాడతారు. కానీ ఈ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన అర్హతలపై మాత్రం అంతగా దృష్టి పెట్టరు. ఎందుకంటే కేవలం అదృష్టం వల్ల వచ్చిన ఫలితాలు చాలాసార్లు తాత్కాలికమేనని మరచిపోతారు. ఈ విషయాన్ని ప్రాచీన భారత చింతనకర్త ఆచార్య చాణక్యుడు తన'చాణక్య నీతి'లో స్పష్టంగా తెలియజేశాడు. చాణక్యుని ఈ నీతి వాక్యాలను జీవనవిధానంగా మార్చుకుంటే,ఒకరు కోల్పోయిన ప్రతిష్ఠను తిరిగి పొందటమే కాక,సమాజంలో మరింత గౌరవాన్ని సంపాదించవచ్చు. అంతేకాదు, ఏదైనా ఒక సమయంలో మన శత్రువు కూడా మన విలువను గుర్తించి అభినందించే స్థితికి రావచ్చు. ఈ విధంగా చాణక్యుని సూత్రాలను అనుసరిస్తే, మనకి ధనం, విజయాన్ని పొందే అవకాశం కూడా లభిస్తుంది.

వివరాలు 

చాణక్యుని దృష్టిలో అసలైన ప్రత్యేకతలు 

ఆచార్యుడు వివరించిన ప్రకారం, ఒక వ్యక్తి వద్ద ఉన్న నిజమైన గుణాలే అతడిని మహోన్నత శిఖరాల దిశగా నడిపిస్తాయి. అటువంటి గుణాలు కలిగిన వ్యక్తిని చూసి శత్రువు కూడా తలవంచే పరిస్థితి ఏర్పడుతుంది. జీవితంలో విజయపథం ఎక్కాలంటే చాణక్యుడు చెప్పిన మూడు ముఖ్యమైన సిద్ధాంతాలను పాటించాల్సిందే. 1. ఎల్లవేళలా జ్ఞానంతో.. తెలివి, వివేకం, విద్య గలవారికి ఎక్కడైనా గౌరవం లభిస్తుంది. అందుకే, ప్రతి దశలో కూడా ఎప్పటికప్పుడు కొత్త జ్ఞానాన్ని సంపాదించేందుకు ప్రయత్నించాలి. జ్ఞానాన్ని పెంచుకోవడమే కాకుండా, ఇతరులతో పంచుకోవడం కూడా ఎంతో అవసరం. ఈ విధంగా జీవించిన వారిని కేవలం మిత్రులే కాదు - శత్రువులు కూడా గౌరవిస్తారు.

వివరాలు 

2. సంస్కారవంతంగా మెలగాలి 

ఏ వ్యక్తి నిజాయితీగా, సంస్కారపూర్వకంగా ఉంటే - అతడిపై అసత్య ఆరోపణలు చేయడం అసాధ్యం అవుతుంది. అలాంటి వ్యక్తిని అవమానపరచాలని ఎంతగా ప్రయత్నించినా, శత్రువులు ఆశించిన విధంగా అతడి ప్రతిష్ఠను దెబ్బతీయలేరు. అంత శక్తివంతమైనది నిజాయితీ. 3. సమర్ధవంతంగా.. ఏ పని చేసినా దాన్ని ప్రేమతో, అంకితభావంతో చేయగలిగితే, ఇతరులు అతడిని నిపుణుడిగా గుర్తిస్తారు. అటువంటి వారికే ప్రాధాన్యత,గౌరవం,సంపదలూ త్వరగా లభిస్తాయి. తమదైన నైపుణ్యాలతో ప్రకాశించే వ్యక్తులను కూడా శత్రువులు తప్పక మెచ్చుకుంటారు. చాణక్యుడు చెప్పిన ఈ మూడు నీతి సూత్రాలను జీవితంలో పాటించగలిగితే, గౌరవం, శత్రువులకే శరణ్యమైన స్థానం,విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. అదృష్టంపై ఆధారపడకుండా, అర్హతలు పెంచుకోవడమే మన లక్ష్యం కావాలి.