
Motivation: చాణక్య సూత్రం.. ఈ మూడు పనులు చేస్తే.. వెంటనే స్నానం చేయాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
చాణక్యుడు.. భారతదేశం గర్వించే తత్వవేత్త. ఆచార్య చాణక్యుడు రచించిన చాణక్య నీతిలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే జీవిత సూత్రాలున్నాయి. కుటుంబ సంబంధాలు, ప్రేమ, స్నేహం, విజయ రహస్యాలు వంటి అనేక అంశాలపై ఆయన ఇచ్చిన మార్గనిర్దేశం ఇప్పటికీ సమకాలీనంగా నిలుస్తోంది. ఇక చాణక్యుని సూచనల ప్రకారం, మానవులు కొన్ని పనులు చేసిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలని పేర్కొన్నారు. అలా చేయకపోతే దురదృష్టం వెంటాడవచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. ఆ పనులు, వాటి ప్రభావం, ఎందుకు స్నానం చేయాలో ఇప్పుడు చూద్దాం.
Details
1. శారీరక సంబంధం తర్వాత
చాణక్యుడు స్పష్టంగా పేర్కొన్న అంశం - శారీరక సంబంధం తర్వాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్నానం చేయాలి. ఇది కేవలం శరీర శుభ్రత కోసమే కాదు, ఆరోగ్య పరంగా కూడా ఎంతో ముఖ్యం. లేకపోతే ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆయన చెబుతారు. పెద్దలు కూడా తరచూ ఇదే విషయం గురించి అంటుంటారు. 2. జుట్టు కత్తిరించిన తర్వాత హెయిర్ కట్ చేసిన తర్వాత కూడా స్నానం చేయాలని చాణక్యుడు సూచించారు. ఎందుకంటే, వెంట్రుకలు చర్మానికి అంటుకుని అసౌకర్యాన్ని కలిగించవచ్చు.కొన్ని వెంట్రుకలు మనకు తెలియకుండానే నీరు లేదా ఆహారంతో కడుపులోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. ఇది ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అందుకే హెయిర్ కట్ అనంతరం స్నానం తప్పనిసరి.
Details
3. శరీరానికి నూనె రాసుకున్న తర్వాత
నూనె రాసిన తర్వాత కొంత సమయం ఆగి స్నానం చేయాలని చాణక్యుడు చెబుతారు. ఇది శరీరంలోని చెమట, మలినాలు బయటకు వెళ్లేందుకు సాయపడుతుంది. శరీరానికి తాజాతనాన్ని తీసుకురాగలదు. అంతేకాదు జిడ్డు కూడా తగ్గుతుంది. చాణక్యుని నీతి సూత్రాలు కేవలం మతపరంగా కాక, ఆరోగ్య పరంగా కూడా చాలా విలువైనవని ఈ మూడు సూచనల నుంచే తెలుస్తోంది. వాటిని జీవితంలో అనుసరించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇవి మన ప్రాచీన సంస్కృతికి సమగ్ర దర్పణంగా నిలుస్తాయి.