Page Loader
Kedarnath Dham: ఛార్ ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ డోలి యాత్ర ప్రాముఖ్యత ఏమిటి?
ఛార్ ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ డోలి యాత్ర ప్రాముఖ్యత ఏమిటి?

Kedarnath Dham: ఛార్ ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ డోలి యాత్ర ప్రాముఖ్యత ఏమిటి?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 17, 2025
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

హిందూమతంలో అత్యంత పవిత్రమైన యాత్రలలో చార్ ధామ్ యాత్రకు విశేష స్థానం ఉంది. ఈ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ధామ్లను దర్శించటం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. శివ భక్తులందరికీ ఈ యాత్ర ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే అవకాశంగా భావిస్తారు. ముఖ్యంగా కేదార్‌నాథ్ దర్శనం చేయడం ప్రతి శివ భక్తుడి కల. ఇది శైవ మతంలో ఉన్న 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించేందుకు శ్రమించి ప్రయాణిస్తారు. భక్తులు కేదార్‌నాథ్ స్వామిని దర్శించిన తరువాత తమకు కలిగే దుఃఖాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇక్కడికి వచ్చే భక్తులపై శివుడు తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడని, వారి కోరికలు నెరవేరతాయని గాఢమైన నమ్మకం ఉంది.

వివరాలు 

డోలి ఉత్సవ సంప్రదాయం - కేదార్‌నాథ్ ఆలయంతో కూడిన విశిష్ట ఆచారం 

2025 మే 2న కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు భక్తులకు తెరుచుకోనున్నాయి. ఈ తలుపులు తెరచే ముందు అనేక సంప్రదాయాలను కచ్చితంగా అనుసరిస్తారు. ముఖ్యంగా, ఆలయం తెరవడానికి ముందు భైరవనాథుడిని ప్రత్యేక పూజలతో ఆరాధిస్తారు. అనంతరం కేదార్‌నాథ్ బాబా పంచముఖి డోలీని ఉఖిమఠ్ నుండి కేదార్‌నాథ్ ధామ్ వరకు పల్లకీలో తీసుకెళ్తారు. తదుపరి రోజున ఆలయం భక్తుల కోసం సంప్రదాయాల ప్రకారం తెరవబడుతుంది.

వివరాలు 

కేదార్‌నాథ్ పంచముఖి డోలీ - ప్రత్యేకతలు 

శీతాకాలం సమయంలో ఆలయ తలుపులు మూసివేసినప్పుడు, కేదార్‌నాథ్ స్వామి భోగ విగ్రహాన్ని ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో నిల్వ ఉంచుతారు. ఈ పల్లకీకి ఐదు ముఖాలు ఉండటం వలన దీన్ని "పంచముఖి డోలీ" అని పిలుస్తారు. ఇందులో వెండి తో తయారైన భోగ విగ్రహాన్ని ఉంచుతారు. ఈ విగ్రహాన్ని శీతాకాలపు నివాసంగా గుర్తించిన ఓంకారేశ్వర్ ఆలయానికి తీసుకెళ్తారు. ఆలయం తిరిగి తెరుచుకొనే సమయంలో ఇదే డోలీలో భోగ విగ్రహాన్ని తిరిగి కేదార్‌నాథ్ ఆలయానికి తీసుకెళ్తారు. ఈ విగ్రహాన్ని ఆరు నెలల పాటు కేదార్‌నాథ్ ధామ్‌లో, మిగతా ఆరు నెలలు ఓంకారేశ్వర్ ఆలయంలో పూజిస్తారు. ఇది అక్కడి ఆచార వ్యవస్థలో కీలకమైన భాగంగా మారింది.

వివరాలు 

2025 చార్ ధామ్ యాత్ర - ముఖ్యమైన తేదీలు 

ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర 2025 ఏప్రిల్ 30న ప్రారంభం కానుంది. అదే రోజు యమునోత్రి మరియు గంగోత్రి ఆలయ ద్వారాలు భక్తులకు తెరుచుకుంటాయి. తరువాత, మే 2న కేదార్‌నాథ్ ఆలయం, మే 4న బద్రీనాథ్ ఆలయం తమ ద్వారాలను తెరవనున్నాయి. ఈ పుణ్యక్షేత్రాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయ్. దేశమంతటా నుంచి వేలాది భక్తులు ఈ యాత్రలో పాల్గొనటానికి పెద్ద ఎత్తున చేరుకుంటారు. యాత్రలో మొదటగా యమునోత్రిని దర్శించి, ఆపై గంగోత్రికి వెళ్లడం సంప్రదాయంగా ఉంది. తరువాత కేదార్‌నాథ్ ధామ్ సందర్శించి, చివరిగా బద్రీనాథ్ దర్శనంతో యాత్రను ముగిస్తారు.