పెట్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెంపుడు జంతువుల గురించి తెలుసుకోండి
పెంపుడు జంతువుల్లో కొన్ని అరుదైన జాతులను కొనుక్కోవడానికి ఆస్తులు అమ్మాల్సి ఉంటుంది. సమాజంలో స్థాయి కోసం ఇలాంటి పెంపుడు జంతువులను చాలామంది పెంచుకుంటారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెంపుడు జంతువుల గురించి తెలుసుకుందాం. వైట్ లయన్ పిల్లలు: ఈ తెల్ల సింహం పిల్లలు 14వేల డాలర్ల ఖరీదు చేస్తాయి. ఎడారి ప్రాంతాల్లో, సవన్నా అడవుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని పెంచడానికి చాలా స్థలం కావాలి. అదీగాక వీటికి ప్రత్యేక ఆహారం అందివ్వాలి. సవన్నా పిల్లులు: ఈ పిల్లులు హైబ్రిడ్ రకానికి చెందినవి. అడవి జంతువుల మాదిరిగా కనిపించే ఈ పిల్లి, పొడవైన మెడ, పెద్దకాళ్ళను, విశాలమైన చెవులను కలిగి ఉంటుంది. వీటి ధర 20వేల డాలర్లు ఉంటుంది.
ఖరీదైన పెంపుడు జంతువుల్లో మరికొన్ని రకాలు
టిబెట్ మస్టిఫ్: ఇది కుక్కపిల్ల జాతికి చెందినది. చూడడానికి చాలా పెద్దగా, క్రూరంగా ఉండే ఈ కుక్క, 1మిలియన్ డాలర్ల ధర ఉంటుంది. చూడడానికి పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి వీటిని రక్షణ జంతువులుగా ఉపయోగిస్తారు. ఇవి తమ యజమానులతో చాలా సాన్నిహిత్యంగా ఉంటాయి. మకావ్: మకావ్ అనేది రామచిలుక. చాలా పెద్ద సైజులో ఉంటుంది. 10వేల డాలర్లకు పైగా ఖరీదు చేస్తుంది. వీటిని పెంచడం కష్టంతో కూడుకున్న పని. పోషకాలున్న ఆహారాలను మాత్రమే ఇది తింటుంది. ఇవి చాలా తెలివైనవి. మనుషుల మాటలను ఇమిటేట్ చేసే సామర్థ్యం ఉంటుంది. లోచెన్: కుక్కపిల్ల జాతికి చెందిన దీని ధర 8వేల డాలర్లు ఉంటుంది. సింహా పోలికలతో ఉండి చూడడానికి అందంగా కనిపిస్తుంటుంది.