వివిధ రకాల రంగుల్లోని కూరగాయలు ఎందుకు తినాలో తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఆహారం ఆరోగ్యకరమైనదైతే మన శరీరం ఆరోగ్యంగా మారుతుంది. అందుకే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
రోజువారి ఆహారంలో రకరకాల కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వివిధ రకాల రంగుల్లో ఉండే కూరగాయలు, పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ప్రస్తుతం వివిధ రకాల రంగుల్లో ఉన్న కూరగాయలు, పండ్లు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
ఎరుపు రంగు:
ఈ రంగులోని కూరగాయలు, పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటివి రాకుండా ఉండే అవకాశం ఉంది.
అలాగే చర్మ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి.
Details
మెదడు పనితీరును పెంచే రంగు కూరగాయలు
నీలి రంగు:
ఒక్కో రకమైన రంగులోని కూరగాయలు పండ్లు ఒక్కో రకమైన ఆరోగ్య ప్రయోజనాన్ని అందిస్తాయి. నీలిరంగులోని కూరగాయలు పనులు తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది.
ఈ రంగులోని పండ్లు కూరగాయలు తినడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది.
ఆకుపచ్చ రంగు:
ఆకుపచ్చ రంగు అనగానే మనకు ఆకుకూరలు గుర్తొస్తాయి. ఆకుకూరలు కంటి చూపును మెరుగుపరచడంలో చాలా సహాయం చేస్తాయి. ఆకుపచ్చ రంగులోని ఇతర కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది.
పసుపు, నారింజ:
ఈ రెండు రంగుల్లోని కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.