
ఆహారం జీర్ణం కాక ఇబ్బందులు పడుతున్నారా? మీ జీర్ణశక్తిని ఈ విధంగా పెంచుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. నీళ్ల విరేచనాలు, మలబద్ధకం, గుండె మంట, గ్యాస్ మొదలగు సమస్యలు ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల వస్తాయి.
అంతేకాదు, దీనివల్ల రోగ నిరోధక శక్తి దెబ్బతింటుంది. హార్మోన్లు సరిగ్గా విడుదల కాకపోవడం వల్ల శారీరక సమస్యలు వస్తాయి.
ప్రస్తుతం జీర్ణశక్తిని మెరుగు పరుచుకోవడానికి ఏం చేయాలో చూద్దాం.
ప్రాసెస్ చేసిన ఆహారాలను తినకూడదు:
ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి దెబ్బతింటుంది. ఈ ఆహారాల్లో చెడు కొవ్వులు, రిఫైన్ చేసిన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది.
అందుకే ఈ ఆహారాలను ముట్టుకోకపోవడమే మంచిది.
Details
ఒత్తిడిని దూరం చేసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది
ఫైబర్ ఎక్కువగా కలిగిన ఆహారాలను తీసుకోవడం:
జీర్ణశక్తి బాగుండాలంటే ఫైబర్ ఎక్కువగా కలిగిన ఆహారాలైన ఓట్స్, బార్లీ, చిక్కుళ్ళు గింజలు, మొలకెత్తిన విత్తనాలను తీసుకోవాలి. ఇంకా వివిధ రకాల కూరగాయల్లోనూ ఫైబర్ అధికంగా ఉంటుంది.
మంచి కొవ్వులు:
మనం తీసుకునే ఆహారాల్లో మంచి కొవ్వులు ఉండడం వల్ల జీర్ణశక్తి ఇంప్రూవ్ అవుతుంది. అవిసె గింజలు, చియా గింజలు, వాల్ నట్స్, గుడ్లు, డార్క్ చాక్లెట్స్, సాల్మన్ చేప, టూనా చేప, మాకెరెల్ మొదలగు వాటిల్లో మంచి కొవ్వు ఉంటుంది.
ఒత్తిడి లేకపోవడం:
ఆఫీస్ పనులు లేదా ఇంకా వేరే ఇతర పనుల కారణంగా మీరు ఒత్తిడి ఫీలవుతున్నట్లయితే మీ జీర్ణశక్తి దెబ్బతింటుంది. ఒత్తిడి లేకపోతే జీర్ణక్రియ సులువుగా జరిగిపోతుంది.