Dandruff: చలికాలంలో చుండ్రు సమస్య.. సొల్యూషన్ ఇదిగో!
చలికాలం రాగానే చాలా మందికి తలలో చుండ్రు సమస్య తీవ్రంగా పెరుగుతుంది. ఈ సమస్య వల్ల తలలో దురద పెరిగి, చుండ్రు తెల్లని పొడిలా మారి దుస్తులపై పడటం వంటివి జరుగుతాయి. ఇది ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లేవారికి ఇబ్బందికరంగా ఉంటుంది. చుండ్రు రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. చుండ్రును తొలగించడానికి చాలా మంది యాంటీ డాండ్రఫ్ షాంపూలను ఉపయోగిస్తారు. కానీ ఇవి ఎప్పుడూ ప్రభావవంతంగా పనిచేయవు. అందువల్ల, చలికాలంలో చుండ్రు సమస్యతో బాధపడేవారు ఒక ప్రత్యేక ఆయిల్‌ను ఉపయోగించవచ్చు. ఇది జుట్టు దురద, చుండ్రు సమస్యలకు ఉపశమనం ఇస్తుంది.
వేడి నీటితో తలస్నానం
చలికాలంలో చుండ్రు పెరగడానికి ఒక ప్రధాన కారణం వేడి నీటితో తలస్నానం చేయడమే. వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల తలపై ఉండే సహజ నూనెలు పోయి, తల పొడిగా మారుతుంది. ఈ పరిస్థితి కాలుష్యంతో కలిసి దుమ్ము, ధూళి తలమీద నిలవడానికి దారితీస్తుంది. దాంతో మాడుకు దురద కలిగి, చివరికి చుండ్రుగా మారుతుంది.
చుండ్రును వదిలించే ప్రత్యేక నూనె
చుండ్రు సమస్యను సమర్థవంతంగా తొలగించే ఒక నూనెల మిశ్రమం తయారీ విధానం ఇక్కడ ఉంది. ఒక చిన్న గిన్నెలో రెండు స్పూన్ల ఆవ నూనె, జాంబా నూనె (అరుగుల ఆకు నూనె), పటిక పొడి కలిపి మిశ్రమం తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని తల మాడుకు పట్టించి, ఒకటి నుండి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. తర్వాత తలకు షాంపూతో శుభ్రం చేయాలి. ఈ నూనెల మిశ్రమంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటంతో ఇది చుండ్రును సమర్థంగా తగ్గిస్తుంది.
టీ ట్రీ ఆయిల్ ఉపయోగం
టీ ట్రీ ఆయిల్ కూడా చుండ్రు సమస్యలపై సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ లక్షణాలు చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. టీ ట్రీ ఆయిల్‌ను నేరుగా వాడకూడదు. అందులో కొబ్బరి నూనెను కలిపి తలకు రాస్తే మరింత మంచి ఫలితాలు అందుతాయి.
కలబంద గుజ్జు
కలబంద గుజ్జులో యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. తలకు కలబంద గుజ్జును పట్టించడం వల్ల మాడుకు సాంత్వన లభిస్తుంది. చుండ్రు తగ్గుతుంది. వేప నూనె ప్రయోజనం వేప నూనె లేదా వేప ఆకుల రసంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. దీన్ని తలకు పట్టించడం వల్ల చుండ్రు సమస్యను నియంత్రించవచ్చు. వేప నూనె జుట్టు పెరుగుదలకు కూడా మేలు చేస్తుంది.