దసరా: జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు? దాని ప్రత్యేకత ఏమిటి?
ఈ వార్తాకథనం ఏంటి
దసరా రోజున పిండి వంటలు చేసుకోవడమే కాదు, జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చుకుని ఆలింగనం చేసుకుని విజయ్ దశమి శుభకాంక్షలు చెప్పుకుంటారు.
జమ్మి చెట్టు ఆకులను బంగారం అని పిలుస్తారు. అంతేకాదు, ముందుగా జమ్మి చెట్టుకు పూజ చేసి ఆ తర్వాతే జమ్మి ఆకులను తెంపుతారు.
అయితే జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు? దాని ప్రత్యేకత ఏమిటనేది ఇక్కడ తెలుసుకుందాం.
పాలసముద్రాన్ని దేవ దానవులు చిలికే సమయంలో దేవతా వృక్షాలు ప్రత్యక్షం అయ్యాయట.
అందులో జమ్మి వృక్షం కూడా ఉందట. అందుకే జమ్మి చెట్టును దేవతా వృక్షంలా చెప్పుకుంటారు.
జమ్మి చెట్టు గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. రావణాసురుడి సంహరించడానికి లంకకు వెళ్ళే రాముడు, అంతకన్నా ముందు జమ్మిచెట్టును పూజించి వెళ్లారట.
Details
జమ్మి చెట్టు చుట్టూ ఉన్న కథలు
జమ్మి చెట్టు గురించి ప్రచారంలో ఉన్న మరో కథ ఏంటంటే, పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలను, ఒక బట్టలో చుట్టి జమ్మి చెట్టుపై ఉంచారట.
అజ్ఞాతవాసం ముగియగానే జమ్మి చెట్టుకు అపరాజిత దేవిగా పూజించి ఆయుధాలను తీసుకున్నారట.
జమ్మి చెట్టు ప్రత్యేకతలు:
జమ్మి చెట్టును సంస్కృతంలో శమీ వృక్షం అని పిలుస్తారు. అందుకే దసరా రోజున శమీ పూజ చేసిన తరాతే జమ్మి ఆకులను తెంపుతారు.
జమ్మి చెట్టు ఎలాంటి పరిస్థితుల్లో అయినా పెరుగుతుంది. నీరు ఎక్కువగా ఉన్నా లేకపోయినా కూడా జమ్మి చెట్టు పెరుగుతుంది.
జమ్మి చెట్టు వల్ల అనేక ఆయుర్వేద ఉపయోగాలు ఉన్నాయని చెబుతారు. ఈ చెట్టు గాలి పీల్చడం వల్ల ఆరోగ్యం కలుగుతుందని నమ్మకం.