Page Loader
Dasara Navaratri 2023: ఉపవాసం ఉండేవాళ్ళు తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటో తెలుసుకోండి 
ఉపవాసం ఉండేవాళ్ళు తినాల్సిన ఆహారాలు

Dasara Navaratri 2023: ఉపవాసం ఉండేవాళ్ళు తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటో తెలుసుకోండి 

వ్రాసిన వారు Sriram Pranateja
Oct 16, 2023
05:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

దసరా నవరాత్రులు వచ్చేసాయి. అక్టోబర్ 15నుండి మొదలుకుని అక్టోబర్ 23వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ నవరాత్రుల్లో ఉపవాసం ఉంటారు. కేవలం ఒకపూట మాత్రమే ఆహారం తీసుకునే మిగతా సమయాల్లో ఏమీ తీసుకోకుండా ఉంటారు. అయితే నవరాత్రుల్లో ఉపవాసం ఉండే అన్ని రకాల ఆహారాలను తీసుకోకూడదు. ముఖ్యంగా ఉల్లిపాయ, వెల్లుల్లి ఉన్న ఆహారాలను తినరాదు. ప్రస్తుతం ఉపవాసం ఉండేవారు తీసుకోవాల్సిన ఆహారాల గురించి తెలుసుకుందాం. సాబుదానా కిచిడి: గుజరాత్, మహారాష్ట, రాజస్తాన్ ప్రజలు సాబుదానా కిచిడి ఎక్కువగా తయారు చేసుకుంటారు. సాబుదానాతో పాటు పెరుగు, ఇతర సుగంధ ద్రవ్యాలతో దీన్ని తయారు చేస్తారు.

Details

పన్నీర్ రోల్

పన్నీర్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఉపవాసం ఉండేవారు పన్నీర్ రోల్ తినవచ్చు. తురిమిన పన్నీర్, బంగాళదుంపలు, ఉప్పు, ఉగంధ ద్రవ్యాలను డీప్ ఫ్రై చేస్తే పన్నీర్ రోల్ తయారవుతుంది. అరటి పండు కబాబ్: పండని అరటిపండ్లతో కబాబ్ తయారు చేస్తారు. పండని అరటి పండ్లు, బుక్ వీట్ పిండి, పచ్చి మిరపకాయలు, పండు మిరపకాయలు, అల్లం, ఉప్పు కలిపి అరటి పండు కబాబ్ తయారు చేస్తారు. బంగాళ దుంప కూర: జీలకర్ర, పెరుగు, అల్లం, ఉప్పు, బంగాళ దుంపలతో ఈ కూరను తయారు చేస్తారు. ఈ కూర తయారు చేసిన తర్వాత అందులోని పూరీలను నంజుకుని తింటే బాగుంటుంది. నవరాత్రి సమయంలో బంగాళదుంప కూరను ఖచ్చితంగా తయారు చేస్తారు.