Dasara Navaratri 2023: తొమ్మిది రోజుల్లో తొమ్మిది రంగుల ప్రాముఖ్యతను గురించి తెలుసుకోండి
దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాతను పూజిస్తారు. తొమ్మిది రోజులపాటు తొమ్మిది అలంకారాల్లో అమ్మవారిని కొలుస్తారు. చాలామంది తొమ్మిది రోజులపాటు ఉపవాసం ఉంటారు. ఉదయం, సాయంత్రం అమ్మవారిని పూజించి సాత్వికాహారాన్ని తీసుకుంటారు. ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15నుండి మొదలై అక్టోబర్ 24వ తేదీన ముగుస్తాయి. తొమ్మిది రోజుల్లో 9అలంకారాల్లో దుర్గా మాతను కొలుస్తామని ఇంతకుముందే చెప్పుకున్నాం. అయితే తొమ్మిది రోజులపాటు 9రంగులకు ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతం ఆ రంగుల ప్రాధాన్యం ఏంటో తెలుసుకుందాం. మొదటిరోజు-నారింజ రంగు మొదటిరోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అలంకారంలో పూజిస్తారు. ఈ రోజున నారింజ రంగుకు ప్రాధాన్యం ఉంటుంది.
రెండవ రోజు-తెలుపు
ఈ రోజున గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారిని పూజిస్తారు. జ్ఞానము, తెలివిని అందించే అమ్మవారిగా కొలుస్తారు కాబట్టి ఈరోజు తెలుపు రంగుకు ప్రాధాన్యం ఉంటుంది. మూడవరోజు-ఎరుపు: మహాలక్ష్మి దేవి అవతారంలో మూడవరోజు అమ్మవారిని కొలుస్తారు. ధైర్య సాహసాలను అందించే అమ్మవారిగా ఈరోజు కొలుస్తారు కాబట్టి ఈరోజు ఎరుపు రంగుకు ప్రాముఖ్యత ఉంటుంది. నాల్గవ రోజు-నీలం రంగు: శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారిని కొలుస్తారు. సంతోషాన్ని, క్రియేటివిటీని అందించమని ఈరోజు నీలం రంగు బట్టలు ధరిస్తారు. ఐదవ రోజు-పసుపు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో 5వ రోజు అమ్మవారిని కొలుస్తారు. ఈరోజు పసుపు రంగుకు ప్రాధాన్యం ఉంటుంది. చాలామంది భక్తులు 5వ రోజు నాడు పసుపు రంగు బట్టలు ధరిస్తారు.
ఆరవ రోజు-ఆకుపచ్చ
ఆరవ రోజు నాడు శ్రీ మహా సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారిని పూజిస్తారు. ధైర్యము, సాహసాలు అందించమని అమ్మవారిని కోరుతూ ఈరోజు ఆకుపచ్చని రంగు వస్త్రాలను ధరిస్తారు. ఏడవ రోజు-బూడిద రంగు: ఏడవ రోజు అమ్మవారిని దుర్గాదేవి అలంకారంలో పూజిస్తారు. ఈ రోజున బూడిద రంగుకు ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి భక్తులు బూడిద రంగు బట్టలు ధరిస్తారు. ఎనిమిదవ రోజు-పర్పుల్: మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో కొలుస్తారు. ఈ రోజున పర్పుల్ రంగుకు ప్రాధాన్యత ఉంటుంది. తొమ్మిదవ రోజు-నెమలి నీలిరంగు: శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో అమ్మవారిని కొలుస్తారు. ఈ రోజున నెమలి నీలి రంగుకు ప్రాధాన్యం ఉంటుంది.