NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Dasara Navaratri 2023: భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో దసరా నవరాత్రి ఉత్సవాలను జరుపుకునే విధానాలు 
    తదుపరి వార్తా కథనం
    Dasara Navaratri 2023: భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో దసరా నవరాత్రి ఉత్సవాలను జరుపుకునే విధానాలు 
    దసరా నవరాత్రి ఉత్సవాలు

    Dasara Navaratri 2023: భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో దసరా నవరాత్రి ఉత్సవాలను జరుపుకునే విధానాలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 10, 2023
    05:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. నవరాత్రుల్లో దుర్గామాత అమ్మవారిని పూజిస్తారు.

    ఈ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ నుండి నవరాత్రులు ప్రారంభమవుతాయి. మళ్లీ అక్టోబర్ 24 వ తేదీ రోజున ఉత్సవాలు ముగుస్తాయి.

    భారతదేశంలో ఒక్కో రాష్ట్రంలో నవరాత్రి ఉత్సవాలు ఒక్కో విధంగా జరుగుతాయి. ప్రస్తుతం ఏయే రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

    తెలంగాణ:

    తెలంగాణలో నవరాత్రి ఉత్సవాల్లో బతుకమ్మ పండగ జరుపుకుంటారు.

    తొమ్మిది రోజులపాటు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి ఆటలు ఆడుతూ దగ్గర్లోని చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.

    తొమ్మిది రోజుల బతుకమ్మ పూర్తయిన తర్వాత దసరా పండుగను జరుపుకుంటారు.

    Details

    ఆంధ్రప్రదేశ్ 

    ఆంధ్రప్రదేశ్ లో దుర్గామాత అమ్మవారి ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఉత్సవాలు అంబరాన్ని అంటుతాయి.

    తొమ్మిది రోజులపాటు తొమ్మిది అవతారాల్లో కనకదుర్గ దర్శనమిస్తుంది.

    తమిళనాడు:

    తమిళనాడులో దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గ మాత, లక్ష్మీ, సరస్వతి దేవతలను పూజిస్తారు. బంధువులు, స్నేహితులను ఇంటికి ఆహ్వానించి పండగను జరుపుకుంటారు.

    తమిళనాడులో ప్రత్యేకంగా కోలు అలంకరణ చేస్తారు. కోలు అంటే 9మెట్లు. ఒక్కో మెట్టు ఒక్కో రాత్రిని సూచిస్తుంది. ఈ మెట్ల మీద రకరకాల బొమ్మలు, దేవుడి ప్రతిమలు ఉంచుతారు.

    Details

    వివిధ రాష్ట్రాల్లో నవరాత్రి ఉత్సవాలను జరుపుకునే విధానాలు 

    కర్ణాటక:

    కర్ణాటకలో దసరా రోజున పురాణాల్లోని కథలను యక్షగానం రూపంలో చెబుతుంటారు. ఈ సాంప్రదాయం ఎన్నో ఏళ్లుగా ఇక్కడ అలవాటుగా ఉంది.

    కేరళ:

    కేరళలో విజయదశమిని విద్యారంభం పర్వదినంగా జరుపుకుంటారు. ఈరోజున చిన్నపిల్లలకు చదువు నేర్పించడం మొదలుపెడతారు.

    గుజరాత్:

    నవరాత్రి ఉత్సవాలు దుర్గామాత అమ్మవారిని పూజిస్తారు. నవరాత్రుల సమయంలో గార్బా డ్యాన్స్, దాండియా ఆటలు ఆడతారు.

    పశ్చిమ బెంగాల్, అస్సాం:

    పైన పేర్కొన్న రాష్ట్రాల్లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. దుర్గాపూజ నిర్వహించడం, సింహం మీద కూర్చున్న దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించి పూజించడం చేస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025