Page Loader
Bakrid 2025: ధూల్ హిజ్జా ప్రారంభం.. బక్రీద్ పండుగ తేదీ ఖరారు!
ధూల్ హిజ్జా ప్రారంభం.. బక్రీద్ పండుగ తేదీ ఖరారు!

Bakrid 2025: ధూల్ హిజ్జా ప్రారంభం.. బక్రీద్ పండుగ తేదీ ఖరారు!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో దూల్ హిజ్జా 1446 AH నెల ప్రారంభమైందని షియా, సున్నీ మూన్ కమిటీలు బుధవారం సంయుక్తంగా ప్రకటించాయి. సాయంత్రం నెలవంక దర్శనమైందనడంతో ఈ ప్రకటన వచ్చింది. దీంతో ఇస్లామిక్ సంప్రదాయ ప్రకారం ఈ ఏడాది ఈద్-ఉల్-అదా (బక్రీద్) పండుగ జూన్ 7, 2025 (శనివారం) నాడు జరగనుంది. అంతకు ముందు రోజు, అంటే జూన్ 6 (శుక్రవారం) నాడు అరఫాత్ దినం పాటిస్తారు.

Details

ఈద్-ఉల్-అదా వేడుకల ముఖ్యాంశాలు

ఈద్-ఉల్-అదా ముస్లిం సమాజానికి ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప పండుగ. ఇది విశ్వాసం, నిబద్ధత, దైవ చిత్తానికి లొంగిపోయే తత్వాన్ని గుర్తుచేస్తుంది. వివిధ ప్రాంతాల ముస్లింలు ఐక్యంగా ఈ పండుగను జరుపుకుంటారు. కుటుంబాలు, సమాజాలు కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ, ఈ పండుగ సందర్భంగా దాతృత్వం, దయ, కరుణ వంటి ఇస్లామీయ విలువలను ప్రదర్శిస్తారు. ఈ పండుగ ఆనందం, ఐక్యత, కృతజ్ఞతను పెంపొందించేందుకు ఒక అవకాశంగా మారుతుంది. ప్రత్యేక దుస్తులు ధరించి ముస్లింలు మసీదులు లేదా బహిరంగ ప్రార్థనా ప్రదేశాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ ప్రార్థనల్లో దైవభక్తి, త్యాగం, ఇతరుల పట్ల సహానుభూతిని ఉపన్యాసాల ద్వారా నొక్కి చెబుతారు.

Details

ఖుర్బానీ - త్యాగానికి చిహ్నం

ఈద్-ఉల్-అదాలో ప్రధాన ఆచారం ఖుర్బానీ (జంతు బలి). ఇది ప్రవక్త ఇబ్రహీం అల్లా ఆజ్ఞకు లోబడి తన కుమారుడిని త్యాగం చేయడానికి సిద్ధపడిన ఘట్టాన్ని గుర్తు చేస్తుంది. ఖుర్బానీగా సాధారణంగా మేక, గొర్రె, ఒంటె లేదా గేదెను బలిచేస్తారు. బలిచిన జంతువుల మాంసాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు 1. ఒక భాగం కుటుంబానికి, 2. మరొక భాగం బంధువులు, స్నేహితులకు, 3. మూడవ భాగం పేదలకు పంచుతారు. ఈద్-ఉల్-అదా పండుగ ముస్లింలలో నిస్వార్థత, సేవా భావం, ఇతరుల పట్ల ప్రేమ వంటి విలువలను ప్రతిబింబిస్తుంది. ఇది మానవత్వాన్ని, సామరస్యాన్ని ప్రోత్సహించే గొప్ప ఉత్సవం.