AC in Winter : చలికాలంలో ఏసీని వాడొచ్చా.. వాడకపోతే ఏమవుతుందో తెలుసా
చలికాలంలో ఏసీ వాడటం మంచిదేనా. దీని వల్ల కలిగే లాభా నష్టాలు తెలుసుకుందామా. కాలంతో పని లేకుండా కొందరు ఏసీని విచ్చలవిడిగా వాడేస్తుంటారు. పగలు రాత్రి అన్న బేధం లేకుండా ఏసీని నడిపిస్తుంటారు. అయితే చల్లటి శీతాకాలంలోనూ కొందరు ఏసీని ఆపట్లేదు. అదే పనిగా వాడేస్తుంటారు. దీంతో మనకు, ఏసీకి మంచిదేనా అన్న అనుమానం చాలా మందికి ఉంటుంది. శీతాకాలంలో ఏసీని ఇలా వాడాలి : సాధారణంగా ఏసీని వేసవిలోనే ఎక్కువగా వినియోగిస్తారు. మళ్లీ వచ్చే ఎండాకాలం వరకు ముట్టుకోరు. ఇలా నెలల తరబడి వాడకపోవడంతో అందులో పరికరాలు పని చేయవు. ఎక్కువగా దుమ్ము పేరుకుపోయి మళ్లీ సర్వీసింగ్ చేయించుకోవాల్సి వస్తుంది.
ప్రతి 10 రోజులకోసారి ఆన్ చేస్తే మంచిది
చలికాలంలో పది రోజులకోసారి ఏసీని ఆన్ చేస్తే దాని పనితీరు బాగుంటుంది.కూలింగ్ అక్కర్లేకున్న కేవలం ఫ్యాన్ మోడ్‌లో కాసేపు తిరగనిస్తే దాని జీవిత కాలం పెరుగుతుంది. మరీ చల్లగా ఉంటే రివర్సబుల్ ఏసీని వాడుకోవచ్చు. అంటే ఉష్ణోగ్రతను 30 డిగ్రీల వద్ద వాడుకోవచ్చు. ఫలితంగా గది, బయటి వాతావరణంతో పోలిస్తే వేడిగా ఉంటుంది.ఈ మేరకు నిద్రించేందుకు సౌకర్యంగా ఉంటుంది. ఏసీ ఎక్కువైతే గుబులే : సహజ వాతావరణానికి దగ్గరగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఏసీని ఎక్కువగా ఉపయోగిస్తే సమస్యలు దరి చేరతాయి. కాలంతో సంబంధం లేకుండా ఏసీని అదేపనిగా వాడితే ఆస్తమా, అలర్జీలు, పొడి చర్మం, దురదల్లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఏసీ నిర్వహణకు మాత్రం పదిరోజులకోసారి 10 నిమిషాలు వేస్తే సరిపోతుంది.