Diwali 2023: దీపావళి అలంకరణ నుంచి పూజ వరకు, పండుగను ఎలా జరుపుకోవాలో తెలుసా
ఆశ్వయుజ మాసంలోని అమావాస్య తిథినాడు ఏటా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈసారి నవంబర్ 12న భారతదేశంలో దీపావళి ఘనంగా నిర్వహించుకుంటారు. కుటుంబమంతా కలిసి మెలిసి ఐక్యతతో, దాతృత్వంతో, ప్రేమగుణంతో ఈ పండుగను జరుపుకుంటారు. దీపావళిని 5 రోజుల పండుగగా ఆచారాలతో చేసుకుంటారు. మిరుమిట్లు గొలిపే దీపాల పండుగకు, చెడుపై మంచి సాధించిన విజయాన్ని స్మరించుకోవడమే దీపావళి పండగ. నివాస పరిశుభ్రత : దీపావళికి ముందే ఇంటిని శుభ్రం చేయడం సంప్రదాయం. చిందరవందరగా ఉన్న ప్రదేశాలను చక్కబెట్టడం, బిల్లులు, లెక్కలు, అకౌంట్స్ నిర్వహించడం వంటివి ఉంటాయి. ఇదే సమయంలో ప్రజలంతా, తమ ఇళ్ళు , తలుపులను రంగోలీ డిజైన్‌లతో ముస్తాబు చేస్తారు.
లక్ష్మీదేవి ఆరాధన అంటేనే దీపావళి
మంత్రాలు పఠించండి : హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి శ్రీలక్ష్మి దేవికి సంబంధించిన పండుగ కనుక ఆ దేవి మంత్రాలను, స్తోత్త్రాలను పఠించడం మంచిది. అదృష్టం,సంపద, యవ్వనం, అందం, ఆయుష్షు, ఆశీర్వాదం కోసం మంత్రాలునుజపిస్తారు.వ్యక్తి లేదా కుటుంబం శ్రేయస్సు కోసం "శ్రీమ్" అనే మంత్రాన్ని జపించుకోవచ్చు. దియాలు, కొవ్వొత్తులంటేనే దీపావళి : దీపావళి అంటేనే వెలుగుల పండుగ. ఇదే సమయంలో లక్ష్మీ దేవిని ఇంటికి స్వాగతించేందుకు 4-6 దీపాలు లేదా చిన్న నూనె దీపాలను తలుపుల దగ్గర వెలిగించడం ఆచారంగా కొనసాగుతోంది. వీటిని మీ రంగోలి డిజైన్‌ల చుట్టూ ఏర్పాటు చేసుకోవచ్చు. స్వీట్లు : రకరకాల స్వీట్లు, పొంగళి, లడ్డూ లాంటివి అమ్మవారికి సమర్పిస్తారు. వ్రతాలు, నోములు ఉంటే కుటుంబమంతా కలిసి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.