LOADING...
Diwali 2025: దీపావళి పటాకులు.. చిన్నపిల్లలు జాగ్రత్తలు పాటించాల్సి పాటించాలి! 
దీపావళి పటాకులు.. చిన్నపిల్లలు జాగ్రత్తలు పాటించాల్సి పాటించాలి!

Diwali 2025: దీపావళి పటాకులు.. చిన్నపిల్లలు జాగ్రత్తలు పాటించాల్సి పాటించాలి! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2025
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

దీపావళి అంటే వెలుగుల పండుగ. చీకటిని, చెడును ఓడించి గెలిచిన విజయాన్ని ప్రదర్శించే సందర్భం. దీపాల వెలుగులు, బాణాసంచాల మోతతో ఈ పండుగ మరింత ఉల్లాసంగా మారుతుంది. ముఖ్యంగా పిల్లల కోసం దీపావళి ప్రత్యేక ఉత్సాహాన్ని ఇస్తుంది. దీపావళికి రెండు-మూడు రోజుల ముందు నుంచే పిల్లలు బాంబులను కొని సిద్దమవుతారు. దీపావళి రోజున పిల్లల సంబరం అంతా ఇంతా కాదు. చిన్న చిన్న కాకరపూవులు, పైకి ఎగిరే రాకెట్‌ల వరకు ఎన్నో రకాల బాంబులు వెలుగులు కలిగిస్తూ కాలుతుంటాయి. బాణాసంచా అంటే నిప్పుతో ఆడే ఆట, కాబట్టి జాగ్రత్త అవసరం. ముఖ్యంగా చిన్న పిల్లల కోసం ప్రత్యేక సావధానతలు పాటించాలి:

Details

పక్కనే ఉండండి

చిన్నపిల్లలు బాణాసంచా ఉపయోగించే సమయంలో పెద్దవాళ్లు పక్కనుండాలి. ఒంటరిగా వదిలేయకండి. పెద్ద శబ్దంతో వచ్చే బాంబులు చిన్న పిల్లలకు ఇవ్వకపోవడమే మంచిది. కొందరు పిల్లలు చేతుల్లోనే పటాకులు కాల్చే ప్రయత్నం చేస్తారు, వారిని దూరంగా ఉంచండి. సురక్షిత ప్రదేశంలో కాల్చండి మట్టి నేల, సిమెంట్ రోడ్డు వంటి స్థిరమైన ప్రదేశంలో మాత్రమే బాంబులు కాల్చండి. అగర్బత్తీలు ఉపయోగించి నేరుగా అగ్గిపెట్టెపై పెట్టకండి, ప్రమాదం ఎక్కువ అవుతుంది.

Details

ప్రమాదాలు నివారణ  

బాణాసంచా కాల్చిన వెంటనే దూరంగా నిలబడండి. ఎప్పుడూ వంగి పటాకులను నిప్పుపెట్టండి. పైకి ఎగిరే రాకెట్‌లు ఇళ్లకు దూరంగా, విస్తృతమైన స్థలంలో మాత్రమే కాల్చండి. ప్రమాదం జరిగితే వెంటనే నీళ్లు చల్లడం లేదా బట్టలతో కప్పడం ద్వారా అదనపు భద్రత కల్పించండి.

Details

తప్పనిసరి జాగ్రత్తలు 

టపాసులు పేల్చేటప్పుడు పక్కనే బకెట్‌లో నీళ్లు పెట్టండి. బాణాసంచాను ఇంట్లో కాల్చకండి. పటాకులపై నూనెలు, శానిటైజర్ వాడకండి. పేలని బాంబులను చేతిలోకి తీసుకోకండి, ముందుగా వాటిపై నీళ్లు చల్లండి. పిల్లలు జేబులో టపాసులు ఉంచి తిరగడం ప్రమాదం. వాహనాల దగ్గర టపాసులు కాల్చకండి, ఎందుకంటే పెట్రోలు/డీజిల్ అగ్నిప్రమాదం కలిగించవచ్చు. గాజు, లోహం వంటి పాత్రలలో బాంబులు నిల్వ చేయకండి.