
Diwali Special Recipes: దీపావళి స్పెషల్ రెసిపీలు.. శనగపప్పు వడలు, ఫేణీలు, కోవా కజ్జికాయ ఎలా చేయాలంటే?
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళి స్పెషల్ రెసిపీలు 1. శనగపప్పు వడలు (Wada) కావలసిన పదార్థాలు పచ్చి శనగపప్పు - పావు కిలో నూనె - అరకిలో ఉల్లిపాయలు - 4 పచ్చిమిర్చి - 6 జీలకర్ర - 2 టీ స్పూన్లు ఉప్పు - తగినంత
Details
తయారు చేసే విధానం
1. శనగపప్పును రాత్రి నానబెట్టి కడిగి ఉంచాలి. 2. గుప్పెడు పప్పును పక్కన ఉంచి, మిగిలిన పప్పులో ఉప్పు వేసి కొంచెం బరకగా రుబ్బండి. 3. ఒక గిన్నెలో పక్కన ఉంచిన పప్పు, జీలకర్ర కలపాలి. 4. బాణలిలో నూనె వేడి చేసి, నిమ్మకాయంత వడలు వేసి, పాలిథిన్ కవర్‌పై వడలు ఎర్రగా వేయించాలి. 5. పిండిలో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కలపడం వలన వడలు మరింత రుచిగా ఉంటాయి. 6. వడలను నంజుకోవడానికి అల్లప్పచ్చడి, కొబ్బరి పచ్చడి లేదా శనగపప్పు-కొబ్బరి పచ్చడి వాడవచ్చు.
Details
2. ఫేణీలు (Pheneelu)
కావలసిన పదార్థాలు ఫేణీలు - కేజీ చిక్కటి పాలు - 1 లీటర్ పంచదార - అరకిలో తయారు చేసే విధానం 1. ఫేణీలు స్వీట్ షాపులు, కిరాణా దుకాణాల్లో దొరుకుతాయి. 2. ఒక గిన్నెలో ఫేణీలు తీసుకుని, తగినంత పంచదార, పాలు వేసి 2 నిమిషాలు మరిగించాలి. 3. ఫేణీలు సున్నితంగా, సేమ్యాను పోలిన పద్ధతిలో రెడీ అవుతాయి.
Details
3. కోవా కజ్జికాయ (Kova Kajjikaya)
కావలసిన పదార్థాలు మైదా పిండి - అరకిలో పంచదార - 1 కిలో పాలకోవా - పావు కిలో జాపత్రి - 2 గ్రాములు యాలకులు - 2 గ్రాములు శనగపిండి - 50 గ్రాములు వంట సోడా - పావు స్పూను బేకింగ్ పౌడర్ - పావు స్పూను నెయ్యి - 100 గ్రాములు రిఫైన్డ్ ఆయిల్ - తగినంత
Details
తయారు చేసే విధానం
1. శనగపిండిలో కోవా కలిపి కొంచెం వేయించి దించాలి. 2. దానిలో జాపత్రి, యాలకులు పొడి, కొంచెం పంచదార కలిపి ముద్దలా చేయాలి. 3. మిగిలిన పంచదార, 2 గ్లాసుల నీళ్లు వేడి చేసి లేత పాకం వరకు ఉంచి దించాలి. 4. మైదా పిండిలో వంట సోడా, బేకింగ్ పౌడర్ జల్లించి, కరగిన నెయ్యి, నీళ్లు కలిపి గట్టి ముద్దలా చేసుకోవాలి. 5. ముద్దను పూరీలా చేసి, మధ్యలో కోవా మిశ్రమం పెట్టి అర్ధచంద్రాకారంలో మూసి అంచులను తడిచేయాలి. 6. నూనెలో వేయించి, కొంచెం రంగు వచ్చాక పంచదార పాకంలో ముంచి తీస్తే కోవా కజ్జికాయలు సిద్దం!