LOADING...
Motivation: ఉదయం ఆరోగ్యంగా, ఆనందంగా ప్రారంభించాలంటే ఇలా చేయండి!
ఉదయం ఆరోగ్యంగా, ఆనందంగా ప్రారంభించాలంటే ఇలా చేయండి!

Motivation: ఉదయం ఆరోగ్యంగా, ఆనందంగా ప్రారంభించాలంటే ఇలా చేయండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 10, 2025
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉదయం నిద్ర లేవగానే మీకు శరీరంగా, మానసికంగా తాజా అనిపించాలి. ఎందుకంటే ఉదయం మొదటి కొన్ని నిమిషాల్లో మనకు ఎలాంటి భావోద్వేగాలు వస్తాయో, అవే ఆ రోజంతా ప్రభావం చూపిస్తాయి. ఉదయం చిరాకుగా నిద్రలేవడం వల్ల ఆ రోజంతా ఉత్సాహం లేకుండా గడిచే అవకాశముంది. సాధారణంగా ఆఫీసులు, స్కూళ్లు మొదలవుతున్న వేళలో ఉదయం చాలా హడావుడిగా ఉంటుంది. అందుకే, ప్రతి రోజు ఉదయం సానుకూలంగా ప్రారంభించేందుకు కొన్ని ముఖ్యమైన అలవాట్లు పెంపొందించుకోవాలి.

Details

ఉదయాన్ని ప్రశాంతంగా ప్రారంభించండి

రోజు ప్రారంభంలో మీకు మీరు అరగంట సమయం కేటాయించండి. నిద్రలేచిన వెంటనే దాహంగా ఉండటం సహజం, అలాగని బిజీగా తయారయ్యే పని తొందరపడకండి. ఈ అరగంటలో మీరు చేసే కొన్ని పనులు మీ రోజంతా సానుకూలంగా, శక్తివంతంగా ఉండేలా చేస్తాయి. 1. సానుకూల ఆలోచనలతో మొదలు పెట్టండి నిద్రలేచిన వెంటనే మీరు నమ్మే దేవునికి కృతజ్ఞతలు తెలపండి. ఆ రోజు శుభంగా గడవాలని కోరుకుంటూ ధైర్యంగా ముందడుగు వేయండి. 'ఈ రోజు నేను అన్ని పనులు సమర్థంగా పూర్తి చేస్తాను' అనే ధృఢ నిశ్చయంతో మొదలు పెట్టండి. "నిన్నటి కన్నా నేడు మెరుగ్గా జీవించాలి" అనే సంకల్పంతో మీలో ఉత్సాహం నింపుకోండి.

Details

2. శ్వాస వ్యాయామాలు - ధ్యానానికి సమయం కేటాయించండి 

నిద్రలేచిన వెంటనే మంచంపై కూర్చొని కొన్ని నిమిషాలు లోతైన శ్వాసలు తీసుకుంటూ శ్వాస వ్యాయామాలు చేయండి. ఇవి మీ మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఉదయాన్నే ఈ ఆత్మసంయమనం మీ శరీరాన్ని, మనసును ఒత్తిడికి బారిన పడకుండా చేస్తుంది. కనీసం 10 నిమిషాలు ఈ విధంగా ధ్యానంలో ఉండటానికి ప్రయత్నించండి. 3. గ్లాసు నీళ్లు తాగడం మర్చిపోవద్దు రాత్రంతా శరీరం నీరుపై ఆధారపడుతూ ఉంటుంది. అందుకే, ఉదయం లేవగానే ముందుగా ఒక గ్లాసు నీరు తాగండి. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. పేగుల శుభ్రతకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

Details

4. చిన్నపాటి వ్యాయామాలు చేయండి 

ఉదయాన్నే కాసేపు శరీరాన్ని స్ట్రెచ్ చేయండి. కాళ్లు, చేతులు సాగదీయడం, మెత్తగా కదల్చడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. అలసట తగ్గి శక్తివంతంగా అనిపిస్తుంది. 10 నిమిషాల పాటు యోగా, హల్కా ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరానికి ఉత్సాహం వస్తుంది. దీనివల్ల మీరు ఆ రోజంతా చురుకుగా ఉండగలుగుతారు. ముగింపు మాట ఉదయం లేవగానే మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు మీ రోజంతా ప్రభావితం చేస్తాయి. సానుకూల ఆలోచనలు, ధ్యానం, నీళ్లు తాగడం, వ్యాయామం — ఇవన్నీ కలిపి మంచి ఆరోగ్యాన్ని, మానసిక స్థిరతను అందిస్తాయి. అందుకే ప్రతి ఉదయాన్ని మిమ్మల్ని ప్రేమించేలా, శ్రద్ధ తీసుకునేలా ప్రారంభించండి!