Page Loader
మెడ నుండి వీపు భాగం వరకు వెన్నెముక ఆకారం గుండ్రంగా మారిందా? ఈ వ్యామాయాలు చేయండి 
వీపు పై భాగంలో వెన్నెముక ఆకారంలో గుండ్రంగా ఉంటే చేయాల్సిన వ్యాయామాలు

మెడ నుండి వీపు భాగం వరకు వెన్నెముక ఆకారం గుండ్రంగా మారిందా? ఈ వ్యామాయాలు చేయండి 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 16, 2023
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు గానీ, టీచర్లు గానీ మీరు మెడ కింది భాగాన్ని కొంచెం వంగి కూర్చుంటే నిటారుగా కూర్చోండని చెప్పి ఉంటారు. అది మీ మంచి కోసమే. మీరు కూర్చునే పొజిషన్ సరిగా లేనట్లయితే మెడ నుండి వీపు భాగం వరకు వెన్నెముక ఆకారం గుండ్రంగా మారుతుంది. ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే చేయాల్సిన వ్యాయామాలు ఏంటో చూద్దాం. సూపర్ మ్యాన్: బోర్లా పడుకుని చేతులను తలకు సమాంతరంగా ముందుకు చాపాలి. ఇప్పుడు కాళ్ళను మడవకుండా పైకి లేపాలి. చేతులను కూడా మడవకుండా పైకి లేపాలి. ఈ పొజిషన్ లో కాళ్ళు, చేతులు మీ నుండి దూరంగా సాగుతున్నట్లు అనిపించాలి. ఇలా 3సెకండ్లు ఉన్న తర్వాత మళ్ళీ రిపీట్ చేయండి.

Details

ఫోమ్ రోలింగ్ తో సాధారణ స్థితికి మారే వెన్నెముక 

వాల్ సైడ్స్: మీ తల, వీపు, నడుము గోడకు ఆనేలా నిల్చోవాలి. ఇప్పుడు మీ చేతుల వెనక భాగాలను గోడకు ఆనించి వాటిని కిందకు పైకి లేపాలి. చేతులను పైకి అన్నప్పుడు శ్వాస పీల్చడం, కిందకి అన్నప్పుడు వదలడం చేస్తూ ఉండాలి. ప్రోన్ కోబ్రా: బోర్లా పడుకుని కాళ్ళను కొంచెం ఎడంగా చాపాలి, ఛాతి భాగాన్ని, తలకు కొంచెం పైకెత్తాలి. ఇప్పుడు మీ చేతులను సాగదీస్తూ భుజాలను గట్టిగా లాగండి. 15-20సెకన్లు చేసి మళ్ళీ రిపీట్ చేయండి. ఫోమ్ రోలింగ్: నేల మీద వెల్లకిలా పడుకుని నడుము పైభాగం కింద ఫోమ్ రోలర్ ని ఉంచి నడుము మధ్యభాగం నుండి భుజాల వరకు నెమ్మదిగా రోలర్ ను తిప్పాలి.