LOADING...
Jamun Fruit: షుగర్ వ్యాధులకు నేరేడు పండు ఎలా పనిచేస్తుందో తెలుసా?.. ఇందులోని పోషకాలు ఇవే!
షుగర్ వ్యాధులకు నేరేడు పండు ఎలా పనిచేస్తుందో తెలుసా?.. ఇందులోని పోషకాలు ఇవే!

Jamun Fruit: షుగర్ వ్యాధులకు నేరేడు పండు ఎలా పనిచేస్తుందో తెలుసా?.. ఇందులోని పోషకాలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
03:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

వర్షాకాలం వచ్చిందంటే తొలుత గుర్తొచ్చే ఫలాల్లో నేరేడు (జామున్) ప్రత్యేకమైనది. వగరు-తీపి మిశ్రమ రుచితో నోటిలో కలిసిపోయే ఈ నల్లటి పండు, కేవలం రుచికే కాదు.. ఆరోగ్యానికి కూడా ఓ అద్భుత ఔషధగుణం గలవిగా పోషక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఇది వరంగా మారనుంది. నేరేడు పండులోని పోషకాలు, మధుమేహాన్ని అదుపులో ఎలా ఉంచతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Details

నేరేడు పండులో దాగి ఉన్న పోషక నిధి

ఈ చిన్న పండు, అనేక విలువైన పోషకాలను అందిస్తుంది. వాటిలో ముఖ్యమైనవి ఇవే: విటమిన్ సి: రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. విటమిన్ ఏ: కళ్ల ఆరోగ్యం కోసం కీలకం. దీని ద్వారా దృష్టి మందగించడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు తగ్గుతాయి. బి-విటమిన్లు (B1, B2, B3, B6): శక్తి కోసం, నరాల పనితీరును మెరుగుపరిచేందుకు ఇవి అవసరం. కాల్షియం, ఫాస్ఫరస్: ఎముకలు, పళ్ల బలానికి ఇవి కీలక ఖనిజాలు. ఐరన్: రక్తహీనత నివారణలో సహాయపడుతుంది. పొటాషియం: హార్ట్ ఆరోగ్యానికి, రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం: కండరాల పనితీరు, బ్లడ్ షుగర్ స్థాయిల నియంత్రణకు సహాయపడుతుంది.

Details

మధుమేహం (షుగర్) నియంత్రణలో నేరేడు పాత్ర

1.తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI): దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు. స్థిరంగా ఉండేలా చేస్తుంది. 2.జాంబోలిన్ ప్రభావం: నేరేడులో ఉండే ఈ పదార్థం, ఆహారంలోని కార్బోహైడ్రేట్లు చక్కెరగా మారే వేగాన్ని తగ్గిస్తుంది. 3.ఇన్సులిన్ సున్నితత్వం పెంపు: శరీరం ఇన్సులిన్‌ను బాగా వాడుకునేలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. 4.అధిక ఫైబర్ లభ్యత: జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తూ షుగర్ పెరగకుండా అడ్డుకుంటుంది. తక్కువ ఆకలితో సహజంగా తక్కువ తింటారు. 5.ఆక్సీకరణ ఒత్తిడి నివారణ: మధుమేహం వల్ల కలిగే నరాల బలహీనత, కంటి సమస్యలు వంటి లాంగ్‌టర్మ్ ప్రభావాలను యాంటీఆక్సిడెంట్లు తగ్గించగలవు. 6.దాహం, ఎక్కువ మూత్రం సమస్య తగ్గింపు: మధుమేహంతో సహజంగా వచ్చే ఈ సమస్యలను నేరేడు సమర్థంగా తగ్గిస్తుంది.

Advertisement

Details

ఒక మాటలో చెప్పాలంటే... 

నేరేడు పండ్లు మధుమేహం నియంత్రణకు సహాయపడే సహజ ఔషధం. అయితే ఇవి మందులకు ప్రత్యామ్నాయం కావు. ఆహారంలో చేర్చేముందు, మోతాదు విషయమై డాక్టర్‌ లేదా డైట్ నిపుణుడి సలహా తీసుకోవాలి. అదనంగా, నేరేడు గింజల పొడి కూడా బ్లడ్ షుగర్ నియంత్రణలో సహాయపడుతుందనే పరిశోధనలున్నాయి.

Advertisement