New Year 2024: ఆ దేశాల్లో న్యూ ఇయర్ వేడుకల్లో వింత ఆచారాలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
మరో మూడ్రోజులలో కొత్త సంవత్సరం 2024 లో అడుగు పెట్టనున్నాం. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకులను జరుపుకునేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని దేశాల్లో న్యూ ఇయర్ వేడుకులను విభిన్నమైన పద్ధతిలో జరుపుకుంటారు. ఇండియన్స్ అయితే వేడుకులను ఇంట్లో లేదా బయట కేక్ కట్ చేసి సరదాగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. కొన్ని దేశాల్లో నూతన సంవత్సర వేడుకలను కొన్ని సంప్రదాయాలతో జరుపుకుంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్పెయిన్‌లో అర్ధరాత్రి 12 ద్రాక్ష పండ్లను తినడం సంప్రదాయమట. ఒక్కో పండు ఒక్కో నెల అదృష్టానికి సంకేతాన్ని సూచిస్తుందని వారు నమ్ముతారు.
డెన్మార్క్ లో వంట పాత్రలు విసరడం ఆచారం
ఇక బ్రెజిల్‌లో అయితే ప్రజలు తెలుపు రంగు బట్టలు ధరించి సముద్ర దేవత అయిన యెమోంజకు నైవేద్యంగా సముద్రంలోని పూలు విసురుతారు. స్కాట్లాండ్‌లో మాత్రం అర్ధరాత్రి దాటాక ఇంట్లోకి మొదటగా ఎవరైతే అడుగు పెడతారో వారు అదృష్టం రూపంలో బహుమతులను తెస్తారట. జపాన్‌లో అయితే అర్ధరాత్రి వేళ దేవాలయాల వద్ద 108 సార్లు గంటలు మోగిస్తారట. డెన్నార్క్ లో మాత్రం అదృష్టానికి చిహ్నంగా కుటుంబ సభ్యుల తలుపులపై వంట పాత్రలు విసరడం అనవాయితీ. సౌతాఫ్రికా ప్రజలు కిటికీల నుండి పాత వస్తువులు, ఫర్నీచర్ బయటకు విసిరేస్తారు. రష్యాలో అయితే కాగితంపై న్యూ ఇయర్ విషెస్ రాసి దానిని కాల్చి ఆ పొడిని అర్ధరాత్రి షాంపైన్‌లో కలుపుకుని తాగుతారట.