
Goat Milk: వేసవిలో మేక పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా? అసలు నిజం ఏమిటంటే!
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి. దీంతో ఎండదెబ్బ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతోంది.
ఈ సమస్య నుంచి బయటపడేందుకు మేక పాలు అద్భుతమైన పరిష్కారంగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మేక పాల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
గ్రామీణ ప్రాంతాల్లో మేక పాలను ఎండదెబ్బ నివారణకు వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. మేకలు అడవుల్లో, పొలాల వద్ద, వాగుల ఒడ్డున మేత మేయడం వల్ల వివిధ ఔషధ మొక్కలను తింటాయి.
అందువల్ల మేక పాల్లో విటమిన్లు, ఖనిజాలు వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
Details
ఎండదెబ్బకు మేక పాలు ఎలా ఉపయోగించాలి?
వేసవిలో ఎండదెబ్బ తగిలిన పిల్లలకు తాజాగా పిండిన మేక పాలను అరికాళ్లకు, అర చేతులకు రాయాలి.
ఒకటి రెండు చుక్కలు చెవుల్లో వేసుకోవడం వల్ల వేడిని తగ్గించుకోవచ్చు.
చిన్న పిల్లల నెత్తిపై రెండు మూడు చుక్కలు రాసితే మరింత త్వరగా ఉపశమనం కలుగుతుంది.
ఇది కేవలం చిన్న పిల్లలకే కాకుండా, అన్ని వయస్సుల వ్యక్తులకు ఉపయోగపడుతుంది.
మేక పాలను శరీరంపై రాసిన 15-20 నిమిషాల్లోనే చల్లదనం కలిగి, శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది ఎండదెబ్బతో బాధపడుతున్నవారికి వేగంగా ఉపశమనం అందించే ప్రాక్టికల్ హోమ్ రెమెడీగా నిలుస్తోంది.