LOADING...
Diwali 2025: పండితుల చెప్పిన ప్రకారం దీపావళి ఎప్పుడు చేసుకోవాలో తెలుసా?
పండితుల చెప్పిన ప్రకారం దీపావళి ఎప్పుడు చేసుకోవాలో తెలుసా?

Diwali 2025: పండితుల చెప్పిన ప్రకారం దీపావళి ఎప్పుడు చేసుకోవాలో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2025
05:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

దీపావళి పండుగ 2025లో ఎప్పుడు జరుపుకోవాలో చాలామందికి సందేహమే. కొంతమంది అక్టోబర్ 20ని, మరికొందరు 21ని పండుగగా భావిస్తున్నారు. నిజానికి దీపావళి పండుగ హిందూ మతంలో ముఖ్యమైనది. ఇది మంచిదే చెడు గెలిచిందని సూచించే సందర్భంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకోవడం సంప్రదాయం. ఈ సంవత్సరం తిథుల కారణంగా కొంత గందరగోళం ఏర్పడింది. 2025లో అమావాస్య అక్టోబర్ 20 సోమవారం సాయంత్రం 3:44 నిమిషాలకు ప్రారంభం అయ్యి, అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 5:54 గంటలకు ముగుస్తుంది.

Details

అక్టోబర్ 20న జరుపుకోవడం ఉత్తమం

అందువల్ల పండుగ తేదీపై ప్రజల్లో సందేహం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీపావళి రాత్రి సమయంలో జరుపుకోవాలి, ముఖ్యంగా లక్ష్మీ పూజ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ప్రదోష కాలంలో నిర్వర్తించాలి. 2025లో ప్రదోష కాలం, అమావాస్య తిథి సమయం అక్టోబర్ 20 సోమవారం రాత్రికి సరిపడుతున్నందున, పండితుల సూచన ప్రకారం ఈసారి దీపావళి పండుగను అక్టోబర్ 20న జరుపుకోవడం ఉత్తమం.