
Palapitta: దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూడాలో తెలుసా..? పురాణాలు ఏం చెబుతున్నాయి!
ఈ వార్తాకథనం ఏంటి
విజయ దశమి వేడకులు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతాయి. ఇక తెలంగాణలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడ స్థిరపడినా దసరాకు పండక్కి తప్పక సొంతూరుకు వస్తుంటారు.
దసరా రోజున తెలంగాణ ప్రజలు రెండు పనులు చేస్తుంటారు.
ఒక జంబి పంచుకోవటమైతే, మరొకటి పాలపిట్టను చూడటం. ఆసలు దసరాకు ఈ పాలపిట్టకు అసలు సంబంధం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
దసరా రోజున తప్పకుండా పాలపిట్టను చూడాలని పెద్దలు చెబుతుంటారు. ఈ పక్షిని చూసేందుకు ప్రజలు ఊరి చివరకు వెళ్తుంటారు.
Details
ఉత్తర వైపున పాలపిట్టను చూస్తే మంచిది
పట్టణాల్లో అయితే డబ్బులిచ్చి మరీ దర్శనం చేసుకుంటారు. దసరా రోజున పాలపిట్టను చూస్తే ఎంతో అదృష్టంగా భావిస్తుంటారు. ఇక ప్రజల సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రకటించింది.
పాలపిట్టను పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తారు. పాండవులు జూదం ఆడి రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత పాండవుల అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేసిన విషయం తెలిసిందే.
ఈ రెండు ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తుండగా పాండవులకు మధ్యలో పాలపిట్ట కనిపించిందని చెప్తుంటారు.
ఇలా పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగించుకొని తిరిగి వచ్చిన రోజునే విజయదశమిని జరుపుకుంటారు.
ఇక దసరా రోజున పాలపిట్ట ఉత్తర దిశ వైపు కనిపిస్తే శుభమని చెబుతారు.