డాల్ఫిన్ల అవగాహనపై ఒక నెల: ఈ సముద్ర జీవుల 5 ప్రత్యేకతలు
మార్చ్ నెలను డాల్ఫిన్ల అవేర్ నెస్ మంత్ అంటారు. మనిషి తర్వాత అత్యంత తెలివైన జంతువుల్లో డాల్ఫిన్స్ కూడా ఒకటి. వీటి గురించి కొన్ని ప్రత్యేక విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. మనిషి కంటే ఎక్కువ సైజులో మెదడు: డాల్ఫిన్ల మెదడు మనిషి మెదడు కంటే పెద్దగా ఉంటుంది. మనుషుల మెదడు సుమారు 1300గ్రాములు ఉంటుందనుకుంటే డాల్ఫిన్ల మెదడు 1600గ్రాముల వరకూ ఉంటుంది. అంతేకాదు, డాల్ఫిన్లకు భావోద్వేగాలు ఉంటాయి. ఇతర డాల్ఫిన్ల మెదడును అవి చదవగలవు కూడా. ప్రత్యేక విజిల్: డాల్ఫిన్లు ఒకరకమైన విజిల్ శబ్దాన్ని చేయగలవు. ఈ విజిల్ శబ్దం ఒక్కో డాల్ఫిన్ కి ఒక్కోరకంగా ఉంటుంది. ఈ శబ్దాల ద్వారానే అవి తమ తోటి డాల్ఫిన్లు ఎక్కడున్నాయో తెలుసుకుంటాయి.
20మైళ్ళు ఈతకొట్టగల సామర్ర్థ్యాన్ని కలిగి ఉండే డాల్ఫిన్లు
డాల్ఫిన్లు చాలా ఈత కొడతాయి. సాధారణ సమయాల్లో గంటకు 8మైళ్ళు ఈతకొట్టగలవు. ఒకవేళ ఏదైనా అత్యవసర సమయాల్లో అవి 20 నుండి 25మైళ్ళ వేగంతో ఈతకొట్టగలవు. అంటే గంటకు 20-25మైళ్ళు ప్రయాణించగలవు. ఒంటికన్నుతో నిద్రపోతాయి: తమ కంటే పెద్దవైన తిమింగళాలు దాడిచేస్తాయన్న భయంతో, ఒంటి కన్నుతో నిద్రపోతాయి. ఒక కన్ను మూసుకుని ఉంటే మరోకన్ను తెరిచే ఉంటుందన్నమాట. ఇలా కన్ను మూసినపుడు మెదడూలోని అర్థభాగం కూడా మూసుకుపోతుంది. డాల్ఫిన్ల జ్ఞాపక శక్తి అమోఘం: చాలా జంతువులకు జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. కానీ డాల్ఫిన్లు అలా కాదు, తన నుండి విడిపోయి 20సంవత్సరాలైన డాల్ఫిన్ మళ్ళీ వచ్చి విజిల్ వేస్తే ఆ శబ్దాన్ని డాల్ఫిన్లు గుర్తుపట్టేస్తాయి.