
ప్రేరణ: గతాన్ని గుర్తు తెచ్చుకుని మరీ బాధపడేవారి భవిష్యత్తులో ఆనందం కనిపించదు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగులో ఒక సామెత ఉంటుంది. గతమెప్పుడూ అందంగానే ఉంటుందీ అని. ఇది అందరికీ కాదు, కొంతమందికి గతమంతా చేదు జ్ఞాపకాలే ఉంటాయి.
అలాంటి జ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలని ఎవ్వరికీ అనిపించదు. కానీ కొంతమంది మాత్రం గుర్తు చేసుకుంటారు. గతంలో జరిగిన అవమానాల్ని, అనుభవాల్ని గుర్తు తెచ్చుకుంటూ బాధపడతారు.
ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, వాళ్ళున్న ప్రస్తుత కాలం బాగానే ఉన్నా కూడా గతాన్ని తల్చుకుంటూ బాధపడుతూనే ఉంతారు. వీళ్ళకు జనరల్ గా ఏడవడం అంటే ఎక్కువ ఇష్టంగా ఉంటుంది.
ఐతే ఇలా బాధపడటం మంచిదా? కాదు, గతాన్ని తలచుకుంటూ బాధపడితే బాధ తప్ప స్వాంతన లభించదు. వర్తమానం బాగున్నప్పుడు గతాన్ని తలచుకోవడం ఎందుకు? బాధపడటం ఎందుకు?
ప్రేరణ
గతం ఎంత చెడ్డదైనా అది గడిచిపోయిందని గుర్తుంచుకోవాలి
గతాన్ని తల్చుకుని బాధపడేవాళ్ళు ఒంటరిగా బాధపడకుండా నలుగురితో చెప్పుకుని ఏడుస్తారు. అలా చెప్పుకోవడం వాళ్ళకి ఆనందమేమో గానీ వినేవాళ్ళకు మాత్రం కాదు.
ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే, చెప్పిన బాధలనే మళ్ళీ మళ్ళీ చెబుతూ వినే వాళ్లని ఇబ్బంది పెడతారు.
ఇలా చెప్పుకోవడానికి గల కారణాలను కొంతమంది నిపుణులు విశ్లేషించారు.
మొదటగా, ప్రస్తుత జీవితంలో హ్యాపీనెస్ ఉన్నా కూడా తర్వాతేం చేయాలో వాళ్లకు తెలియకపోవడం.
రెండు.. భవిష్యత్తులో ఏం చేయాలో తెలియక ఇప్పుడున్న పరిస్థితికే సంతృప్తి చెంది, గతంలో తాము ఎన్నో కష్టాలను దాటామని చెబుతూ సానుభూతి పొందడానికని తేలింది.
ఎదగాలనుకునే వారు ఇతరుల సానుభూతి కోరుకోరు. అలాగే, గతంలో ఎంత దుఃఖం ఉన్నా అది గడిచిపోయింది కాబట్టి ఆలోచించకపోవడమే ఉత్తమం.