
Dussehra 2025: దసరా 2025.. ఆయుధ పూజ ప్రాముఖ్యత, ఖచ్చితమైన శుభ సమయాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
హిందువుల ప్రధాన పండగలలో ఒకటి దసరా, దీనినే విజయదశమి అని కూడా పిలుస్తారు. చెడుపై మంచి సాధన, అధర్మంపై ధర్మవిజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగ 2025లో అక్టోబర్ 2వ తేదీ, గురువారం నాడు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ పండగను ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం పదవ రోజున నిర్వహిస్తారు. ఈ రోజు శ్రీరాముడు రావణుడిని సంహరించి ధర్మాన్ని స్థాపించిన రోజుగా మాత్రమే కాదు, దుర్గాదేవి మహిషాసురుడిని వధించిన రోజుగా కూడా పరిగణించబడుతుంది.
Details
దసరా తేదీ, శుభ సమయాలు
దశమి తిథి ప్రారంభం: 1 అక్టోబర్ 2025 సాయంత్రం 7:01 దశమి తిథి ముగింపు: 2 అక్టోబర్ 2025 రాత్రి 7:10 ఆయుధ పూజ సమయం: 2 అక్టోబర్ 2025 మధ్యాహ్నం 2:09 - 2:56 (47 నిమిషాలు) మధ్యాహ్న పూజ సమయం: 2 అక్టోబర్ 2025 మధ్యాహ్నం 1:21 - 3:44 రావణ దహన శుభ సమయం: 2 అక్టోబర్ 2025 సాయంత్రం 6:05 (ప్రదోష కాలం)
Details
ఆయుధ పూజ పద్ధతి
విజయముహూర్తంలో ఆయుధ పూజ చేయడం అత్యంత శ్రేయస్కరమని భావించబడుతుంది. దీని ద్వారా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించగలుగుతారు. 1. పరిశుభ్రత: పూజించాల్సిన ఆయుధాలు లేదా పనిముట్లను పూర్తిగా శుభ్రం చేయాలి. 2. సంస్థాపన: ఆయుధాలు, పరికరాలను శుభ్రమైన ఎరుపు వస్త్రంపై ఉంచాలి. 3. శుద్ధి: ఆయుధాలపై గంగా జలాన్ని చల్లి శుద్ధి చేయాలి. 4. తిలకం, పూల మాల: ఆయుధాలకు పసుపు, కుంకుమ, గంథంతో తిలకం చేసి, పువ్వులు లేదా పూల మాల సమర్పించాలి. 5. పూజ: దీపం వెలిగించి ధూపం వేయడం, జమ్మి ఆకులతో పూజ చేయడం, అక్షతలు మరియు స్వీట్లు సమర్పించడం. 6. సంకల్పం, మంత్రపఠనం
Details
విజయదశమి ప్రాముఖ్యత
1. సత్యం, ధర్మ విజయం: శ్రీరాముడు రావణుడిని సంహరించి చెడుపై మంచి సాధించిన రోజు. ఈ పండుగ ద్వారా చెడుపై ధర్మవిజయం, శాశ్వత సందేశం తెలియజేయబడుతుంది. 2. శక్తి ఆరాధన: నవరాత్రుల తొమ్మిది రోజుల పూజ అనంతరం, పదవ రోజు విజయదశమి గా జరుపుకుంటారు. దుర్గాదేవి మహిషాసురుడిని వధించి ప్రపంచాన్ని రాక్షస బాధల నుంచి విడిపించిందని నమ్మకం. 3. ఆయుధాల, గ్రంథాల పూజ: పురాతన కాలంలో రాజులు, యోధులు ఈ రోజున ఆయుధాలను పూజించి విజయం కోరారు. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ప్రజలు ఆయుధాలు, పనిముట్లు, వాహనాలు, పుస్తకాలు మొదలైన వాటిని పూజించి శక్తి, జ్ఞానం పట్ల గౌరవం తెలియజేస్తారు