
Navratri 2025: దసరా నవరాత్రుల ఉత్సవాలు.. ఏపీ, తెలంగాణలో దర్శించుకోవాల్సినే ఆలయాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు, తెలంగాణలో బతుకమ్మ పండుగతో దేవీ శక్తి పూజలకు వైభవంగా ప్రారంభమవుతుంది. ఇరు రాష్ట్రాల్లోనూ ఈ ఉత్సవాలు విజయదశమి వరకు కొనసాగుతాయి. బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య రోజు ప్రారంభమై, దుర్గాష్టమి రోజుతో ముగుస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలు ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి మొదలై, మహానవమి, విజయదశమి సందర్భంగా ఘనంగా ముగుస్తాయి.
Details
ప్రసిద్ధ ఆలయాలు ఇవే
కనక దుర్గా ఆలయం, విజయవాడ (ఇంద్రకీలాద్రి) ఇక్కడ దుర్గమ్మను 9 అలంకారాల్లో కొలువుతీర్చుతారు. ప్రతి సాయంత్రం లక్ష్మీ పుష్పకల్యాణ మహోత్సవం జరుగుతుంది. విజయదశమి రోజు అమ్మవారిని రాజరాజేశ్వరిగా అలంకరిస్తారు. నవరాత్రి సమయంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి విస్తృతంగా ఉంటుంది. భాగ్యలక్ష్మి ఆలయం, చార్మినార్, హైదరాబాద్ చార్మినార్ దగ్గరభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నిత్యం భక్తులతో నిండుతుంది. నవరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, వేడుకలు, దర్శనాలు వైభవంగా జరుగుతాయి.
Details
మహాశక్తి ఆలయం, కరీంనగర్
ఇక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలు రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు దాండియా నృత్యాలతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. రుద్రచండీ హోమాలు, దేవీపూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు సందడిని పెంచుతాయి. భద్రకాళీ ఆలయం, వరంగల్ భక్తుల సందడి ఇక్కడ ప్రతి రోజు కొనసాగుతుంది. దసరా సమయంలో ప్రత్యేక అలంకారాలతో భక్తులను అనుగ్రహిస్తారు. సీతారామచంద్ర స్వామి ఆలయం, భద్రాచలం భక్తుల కోసం కల్యాణోత్సవం, గోదావరి ఒడ్డున ఘటాల ప్రదర్శన, రావణదహనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Details
బతుకమ్మ పండుగ
మహాలయ అమావాస్య నుంచి ప్రారంభమై దుర్గాష్టమి వరకు జరుపుకుంటారు. స్థానికంగా ఉన్న అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. హుస్సేన్ సాగర్, ఇతర ప్రాంతాల్లో బతుకమ్మ నిమజ్జనాలు ప్రత్యేక సందడితో జరుగుతాయి. బొమ్మల కొలువులు దసరా సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు. ఇది సంప్రదాయం ప్రకారం ప్రజలందరి ఆనందానికి విధేయంగా ఉంటుంది.