
Nuts: రోజూ గుప్పెడు నట్స్ తింటే.. ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!
ఈ వార్తాకథనం ఏంటి
బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్ వంటి గింజలు మన ఆరోగ్యానికి అమితమైన ప్రయోజనాలను అందిస్తాయి.
అయితే ధర ఎక్కువగా ఉండటం లేదా ఇతర కారణాల వల్ల చాలా మంది వీటిని తినటం మానేస్తున్నారు.
కానీ నిజానికి, ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకు గుప్పెడు గింజలను రాత్రి నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం తినడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండటంతో పాటు, ఆరోగ్యాన్ని కాపాడే ఫ్యాటీ యాసిడ్లు కూడా అధికంగా ఉంటాయి.
Details
గుండెకు రక్షణ
చేపల్లో లభించే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఈ గింజల్లో కూడా ఉంటాయి. చేపలను తినలేని వారికీ ఇవి ఉత్తమమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి.
కొంతమంది ఈ గింజల్లో కొలెస్ట్రాల్ ఉంటుందని భయపడుతుంటారు, కానీ నిపుణుల ప్రకారం వీటిలో మేలైన కొవ్వులు మాత్రమే ఉంటాయి.
న్యూట్రిషనిస్టులు సూచించేదేమిటంటే, వీటిని మితంగా తీసుకుంటే హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను (HDL) పెంచుతాయి.
దీని వలన హార్ట్ అటాక్ ముప్పు తగ్గుతుంది.
Details
జీర్ణ సమస్యలకు పరిష్కారం
నట్స్‌లోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచి, రక్తప్రసరణను సులభతరం చేస్తాయి.
వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
ఇవి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచి, ఫాస్ట్‌ఫుడ్ అలవాటును తగ్గించడంలో సహాయపడతాయి.
పరిశోధనల ప్రకారం, నిట్స్‌ను ఆహారంలో భాగం చేసుకున్న వారికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
Details
విటమిన్-ఇ శక్తివంతమైన ఔషధం
నట్స్‌లో విటమిన్-ఇ అధికంగా ఉండటం వల్ల గుండెకు రక్షణ లభిస్తుంది. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా చేస్తుంది, తద్వారా గుండెపోటు, పక్షవాతం ముప్పు తగ్గుతుంది.
వీటిలో వృక్ష సంబంధ స్టెరాల్స్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.
అలాగే ఎల్-ఆర్జినైన్ అనే పదార్థం రక్తనాళాలను మెత్తగా ఉంచి, రక్తప్రసరణను మెరుగుపరచడంలో
రోజూ గుప్పెడు నట్స్ తినడం వల్ల లాభాలే!
పూర్ణ ఆరోగ్యాన్ని పొందాలంటే గింజలను రోజు ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
అన్ని రకాల నట్స్ తినలేకపోయినా, కనీసం ఏదైనా ఒక రకమైన గింజను గుప్పెడు మోతాదులో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
అందుకే, నట్స్‌ను మీ డైట్‌లో భాగం చేసుకోండి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి.