
Benefits Of Cardamom చలికాలంలో యాలకులు తింటే ఇన్ని ప్రయోజనాలున్నాయా..?
ఈ వార్తాకథనం ఏంటి
చలికాలంలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు తలెత్తుంటాయి. దీంతో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలను చేస్తుంటారు.
శీతాకాలంలో జ్వరం, దగ్గు, రుమాటిక్ నొప్పి సమస్య ఎక్కువగా ఉంటుంది.
అయితే ప్రతి రోజూ రెండు యాలకులు(Cardamom) తినడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
యాలకుల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి గ్రీన్, మరొకటి బ్లాక్.
యాలకులు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను దరి చేరకుండా చేస్తుంది.
వీటిని తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన, వికారం వంటివి తగ్గుతాయి.
Details
పురుషుల్లో శారీరక సామర్థ్యాన్ని యాలకులు పెంచుతాయి
గ్యాస్ ఎసిడిటీ, మలబద్ధకం, కడుపునొప్పి, డిప్రెషన్, దంతక్షయం ఉన్నవారు యాలకులు తింటే మంచిది.
ముఖ్యంగా పురుషుల్లో శారీరక సామర్థ్యాన్ని పెంచుతాయి.
యాలకుల్లో పోటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటివి ఉన్నాయి.
యాలకులు గుండె జబ్బులు, గురక, నిద్రలేమీ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
యాలకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఫలితంగా, శరీర వాపు స్థాయి తగ్గుతుంది.
అదే విధంగా ఆర్థరైటిస్ సమస్యలు అదుపులో ఉంటాయి