Page Loader
Phirni recipes: ఈద్ 2025 స్పెషల్.. ఇంట్లోనే రుచికరమైన 'ఫిర్నీ' తయారు చేసే విధానం ఇదే!
ఈద్ 2025 స్పెషల్.. ఇంట్లోనే రుచికరమైన 'ఫిర్నీ' తయారు చేసే విధానం ఇదే!

Phirni recipes: ఈద్ 2025 స్పెషల్.. ఇంట్లోనే రుచికరమైన 'ఫిర్నీ' తయారు చేసే విధానం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2025
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈద్‌ అంటే ఆనందం, రుచికరమైన విందు భోజనం. రంజాన్‌ నెల ముగిసిన తర్వాత ఈద్‌ను ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మతస్తులు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా అనేక రుచికరమైన వంటకాలను తయారు చేస్తారు. అయితే, అందులో ఫిర్నికి ప్రత్యేక స్థానముంది. ఫిర్ని - ఈద్‌ ప్రత్యేకత క్రీమీగా, సువాసనతో నిండిన ఫిర్ని, బాస్మతి రైస్‌, పాలు, సుగంధ ద్రవ్యాలతో తయారుచేసే రుచికరమైన స్వీట్‌. ఇది కేవలం రుచికే కాదు, శరీరానికి చల్లదనాన్ని కూడా అందిస్తుంది. ఈ ఈద్‌కు మీరు ట్రై చేయవచ్చు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు అవెంటో తెలుసుకుందాం.

Details

1. క్లాసిక్‌ కేశర్‌ ఫిర్ని

ఈద్‌ వేడుకలకు సాంప్రదాయ వంటకాలతో ప్రారంభం చేయాలనుకుంటే, కేశర్‌ ఫిర్ని ఉత్తమ ఎంపిక. పచ్చబాస్మతి బియ్యం, పాలు, చక్కెరతో పాటు కుంకుమపువ్వుతో చేసిన ఈ ఫిర్ని రుచికి మించిన సువాసన ఉంటుంది. కాజు, బాదం, పిస్తా వేసి అలంకరిస్తే మరింత రుచికరంగా ఉంటుంది. 2. రోజ్‌ ఫ్లేవర్డ్‌ ఫిర్ని పువ్వుల సుగంధాన్ని ఇష్టపడేవారికి రోజ్‌ ఫిర్ని అద్భుతమైన ఎంపిక. గులాబీ రుచితో, తక్కువ మిఠాసతో ఉండే ఈ ఫిర్ని ఫెస్టివల్‌ స్పెషల్స్‌లో ఒకటిగా నిలుస్తుంది. తుది అలంకరణగా ఎడిబుల్‌ రోజ్‌ పెటల్స్‌, డ్రై ఫ్రూట్స్‌ వేసి అందంగా తయారు చేసుకోవచ్చు.

Details

 3. మామిడి ఫిర్ని 

ఈద్‌ వేడుకలను వేసవి ప్రత్యేకతలతో మేళవించాలంటే మామిడి ఫిర్ని ట్రై చేయండి. పండిన మామిడి ప్యూరీ, పాలు, బియ్యం, యాలకులతో చేసిన ఈ ఫిర్ని ఫ్రూటీ రుచిని అందిస్తుంది. మామిడి ముక్కలు, పిస్తా వేసి అలంకరించుకుంటే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. 4. చాక్లెట్‌ ఫిర్ని స్వీట్‌ లవర్స్‌కు అదనపు ట్రీట్‌! ఈ ఫిర్నీలో కోకో పౌడర్‌ లేదా కరిగించిన చాక్లెట్‌ కలిపి డిసర్ట్‌ లవర్స్‌ను మంత్ర ముగ్ధులను చేయవచ్చు. చివరిగా చాక్లెట్‌ షేవింగ్స్‌ లేదా కోకో నిబ్స్‌ వేసి సర్వ్‌ చేస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

Details

5. పిస్తా ఫిర్ని 

కొంచెం నాటి రుచిని కోరుకునే వారికి పిస్తా ఫిర్ని బెస్ట్‌ ఆప్షన్‌. ఇందులో గ్రౌండ్‌ పిస్తా కలపడం వల్ల ఆకర్షణీయమైన ఆకుపచ్చ రంగు వస్తుంది. పిస్తా, బాదం, కాజు ముక్కలతో గార్నిష్‌ చేస్తే ఈడీ స్పెషల్‌ డిసర్ట్‌గా మారుతుంది. 6. కొబ్బరి-యాలకుల ఫిర్ని కొబ్బరిపాలు, యాలకులు కలిపిన ఈ ఫిర్ని ఓ ప్రత్యేకమైన ఫ్యూజన్‌ రుచి అందిస్తుంది. తియ్యదనం, సువాసనతో పాటు కొబ్బరి తురుముతో తుది అలంకరణ అందంగా తయారవుతుంది. వేడికి, ఒత్తిడికి ఉపశమనంగా ఉండే ఈ ఫిర్ని ట్రై చేయండి. ఈ ఈద్‌ పండుగను మరింత మధురంగా మార్చుకోవడానికి పై రుచికరమైన ఫిర్ని వంటకాలను ట్రై చేయండి. మీ కుటుంబసభ్యులు స్నేహితులతో ఆనందంగా పండుగను జరుపుకోండి!