Loading...
Ex-Nvidia Engineer: ఎన్విడియాకు రాజీనామా చేసి తప్పు చేశానేమో.. మాజీ ఇంజినీర్ కీలక వ్యాఖ్యలు
ఎన్విడియాకు రాజీనామా చేసి తప్పు చేశానేమో.. మాజీ ఇంజినీర్ కీలక వ్యాఖ్యలు

Ex-Nvidia Engineer: ఎన్విడియాకు రాజీనామా చేసి తప్పు చేశానేమో.. మాజీ ఇంజినీర్ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2026
03:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ సంస్థ నుంచి వైదొలగడంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ సీనియర్ రీసెర్చ్ ఇంజినీర్ డారెల్ డాయ్ ఇప్పుడు తన నిర్ణయంపై పునరాలోచనలో పడ్డారు. హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టడంతో తాను తొందరపడి ఉద్యోగాన్ని వదిలేశానేమోనని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.నవంబర్ 23న సోమవారం ఎన్విడియా బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుని హువాంగ్‌ను తిరిగి సంస్థలోకి ఆహ్వానించింది. "జెన్సన్.. మీకు తిరిగి స్వాగతం.మీరు మళ్లీ రావడం సంతోషంగా ఉంది.ఎన్విడియాలో పనిచేస్తున్న నా స్నేహితులు,మాజీ సహచరుల కోసం కూడా ఆనందంగా ఉంది.వెనక్కి తిరిగి చూసుకుంటే..నేను చాలా త్వరగా నిర్ణయం తీసుకున్నానేమో అనిపిస్తోంది.మరో కీలక నిర్ణయం తీసుకునే విషయంలో తొందరపడాలని అనుకోవడం లేదు"అని డారెల్ డాయ్ పేర్కొన్నారు.

వివరాలు 

రాజీనామాకు కారణం అదే.. మళ్లీ చేరతానంటున్న డాయ్!

నవంబర్ 15న డాయ్ ఎన్విడియాకు రాజీనామా చేశారు. జెన్సన్ హువాంగ్ రాజీనామాను బోర్డు అంగీకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎన్విడియా సహ వ్యవస్థాపకుడైన హువాంగ్.. ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు రావడంతో పదవి నుంచి తప్పుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి.

వారిలో ఒకరు ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ (హెల్త్‌కేర్) కింబర్లీ పావెల్ కాగా.. మరొకరు చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్.

ఆలిస్ హువాంగ్‌కు చైనా నిఘా విభాగంతో సంబంధాలు ఉన్నాయని అమెరికా అధికారులు అనుమానించినట్లు వార్తలు వచ్చాయి.

హువాంగ్ తిరిగి రావడంతో తాను మళ్లీ ఎన్విడియాలో చేరే అవకాశాలపై కూడా డాయ్ స్పందించారు.

వివరాలు 

ఎన్విడియాలో మళ్లీ చేరే యోచనలో డాయ్

అయితే ఈ విషయంలోనూ తొందరపడబోనని స్పష్టం చేశారు. హువాంగ్ నాయకత్వంలో పనిచేసే అవకాశాన్ని పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

"ప్రస్తుతానికి కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని,గత విషయాలపై ఆలోచించాలని అనుకుంటున్నాను. నా భవిష్యత్తు గురించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటాను. అందులో భాగంగా ఎన్విడియాకు తిరిగి వెళ్లే అవకాశాన్ని కూడా పరిశీలిస్తాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇకపై ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశాంతమైన మనసుతో, పూర్తిగా ఆలోచించిన తర్వాతే తీసుకుంటాను" అని డాయ్ వెల్లడించారు.

నవంబర్ 20న డాయ్ ఎన్విడియాలో చివరి రోజు పనిచేశారు.

సంస్థకు చెందిన పరికరాలు,గుర్తింపు కార్డును తిరిగి అప్పగించి, అవసరమైన పత్రాలపై సంతకాలు చేసి బయటకు వెళ్లారు.

ADVERTISEMENT

వివరాలు 

జెన్సన్ హువాంగ్‌ను తిరిగి తీసుకొచ్చింది నేనే: ట్రంప్

అదే రోజు మధ్యాహ్నం సమయంలో ఆయనకు సంస్థకు సంబంధించిన ఖాతాల యాక్సెస్ కూడా నిలిపివేశారు.

జెన్సన్ హువాంగ్ మళ్లీ బాధ్యతలు చేపట్టడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.

ఆయన తిరిగి రావడంలో తాను కీలక పాత్ర పోషించినట్లు చెప్పుకున్నారు.

ఎన్విడియా బోర్డు సభ్యులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారిని ఒప్పించినట్లు తెలిపారు.

"నేనే వారిని ఒప్పించాను. ఒప్పందం కుదిరేలా చేశాను. వారం పది రోజుల క్రితంతో పోలిస్తే నిన్న వారిని ఒప్పించడం చాలా సులభమైంది" అని ట్రంప్ సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

హువాంగ్‌కు అమెరికా కాంగ్రెస్ విచారణలు!

జెన్సన్ హువాంగ్ ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు తమ వద్ద ఆధారాలు లేవని అటార్నీ జనరల్ ధ్రువీకరించినట్లు ట్రంప్ వెల్లడించారు.

హువాంగ్‌ను గొప్ప దేశభక్తుడిగా అభివర్ణించారు. అయితే హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టినప్పటికీ అమెరికా కాంగ్రెస్‌లోని మూడు హౌస్ కమిటీల ముందు ఆయన హాజరుకావాల్సి ఉంది.

ఈ కమిటీలతో రహస్యంగా జరిగే ముఖాముఖి విచారణలో పాల్గొననున్నారు.

ఆ తర్వాత 'అమెరికా ఏఐ ఆధిపత్యాన్ని కాపాడటం' అనే అంశంపై సెనేట్ బ్యాంకింగ్ కమిటీ నిర్వహించే బహిరంగ విచారణకు కూడా హాజరుకావాల్సి ఉంటుంది.

ADVERTISEMENT