AP Beaches: శ్రీకాకుళం జిల్లాలో ఈ బీచ్ లు ముందు.. మరే ఏ బీచ్ లు పనికి రావు..
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా 193 కిలోమీటర్ల సముద్ర తీరరేఖను కలిగి ఉంది.ఈ ప్రాంతంలో అనేక బీచ్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఐదు ప్రముఖ బీచ్‌లు ఉన్నాయి. ఆ బీచ్ లు గురించి తెలుసుకుందాం. కల్లేపల్లి బీచ్: శ్రీకాకుళం పట్టణం నుంచి 10కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్, శని,ఆదివారాల్లో స్థానిక ప్రజలతో కిక్కిరిసే వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ నాగవల్లి నది సముద్రంలో కలవడం విశేషం. 2. కళింగపట్నం బీచ్: శ్రీకాకుళం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్,ఇసుక తిన్నెలు, ఉప్పునీటి కయ్యల వల్ల పర్యాటకులను ఆకర్షిస్తుంది.ఇక్కడ ఉన్న లైట్ హౌస్‌ను చూడడానికి శని, ఆదివారాల్లో చుట్టుపక్కల ప్రజలు ఇక్కడికి వస్తారు.వంశధార నది కళింగపట్నం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది.
బ్రిటిష్ కార్గో షిప్‌కు గుర్తుగా ఒక స్థూపం
3. మగధలపాడు బీచ్: ఈ బీచ్‌లో సముద్రంలోకి 500 మీటర్ల లోపలికి వెళ్లే ఒక బ్రిడ్జ్ ఉంది.ఇది సముద్రపు ఉప్పుని, ఉప్పు తయారీకి నీరును తరలించేది. అయితే, ప్రస్తుతం ఇది వాడుకలో లేదు. పర్యాటకులకు అక్కడ నడవడానికి అనుమతి లేదు. కార్తీకమాసంలో ఈ బీచ్ పిక్నిక్ స్పాట్‌గా ప్రసిద్ధి చెందింది.జీడి మామిడి తోటల్లో పిక్నిక్కులు జరుగుతాయి. 4. బారువ బీచ్: శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్‌లో 1917లో మునిగిపోయిన బ్రిటిష్ కార్గో షిప్‌కు గుర్తుగా ఒక స్థూపం నిర్మించబడింది. ఈ బీచ్‌లో, స్థానికులు సూర్యోదయాన్ని చూడటానికి ఎక్కువగా వస్తారు. కార్తీక మాసంలో జీడి మామిడి తోటల్లో పిక్నిక్కులు జరుగుతాయి.
డచ్‌లు నిర్మించిన లైట్ హౌస్
5. బందరువానిపేట బీచ్: శ్రీకాకుళం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో, కళింగపట్నం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్, బందరువానిపేట ఫిషింగ్ విలేజ్‌ను ఆనుకొని ఉంది. డచ్ వారు ఈ ప్రాంతంలో వ్యాపారానికి ఉపయోగించిన ఓడరేవుల్లో బందరువానిపేట ఒకటి. ఇక్కడ డచ్‌లు నిర్మించిన లైట్ హౌస్ ఇంకా చెక్కుచెదరకుండా ఉంది. దీన్ని చూడటానికి చాలామంది ఇక్కడికి వస్తారు.