Vinayaka Temples: భారతదేశంలోని ప్రసిద్ధ వినాయకుడి దేవాలయాలు
వినాయకుడికి చాలా పేర్లు ఉన్నాయి. గజాననుడు, లంబోదరుడు, గణేషుడు, గణపతి.. ఇలా రకరకాల పేర్లతో వినాయకుడిని పూజిస్తారు. శివపార్వతి పుత్రుడైన వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడు. అందుకే విఘ్నేశుడు అని కూడా అంటారు. వినాయకుడి పుట్టినరోజును పునస్కరించుకుని ప్రతీ ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి తిథి రోజున పండగ జరుపుకుంటారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 18వ తేదీన వినాయక చతుర్థి జరుపుకోవాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలోని వినాయక దేవాలయాల గురించి తెలుసుకుందాం.
కాణిపాకం- వరసిద్ధి వినాయకుడు
వరసిద్ధి వినాయకుడిగా కొలవబడే కాణిపాకం వినాయక దేవాలయం, ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉంది. చిత్తూరు నుండి 11కిలోమీటర్లు, తిరుపతి నుండి 68కిలో మీటర్ల దూరంలో గల ఈ దేవాలయానికి అన్ని ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. ముంబై- సిద్ధి వినాయకుడు ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో ఉండే ఈ దేవాలయాన్ని 1801లో లక్ష్మణ్ వితు పాటిల్, దెబాయ్ పాటిల్ నిర్మించారు. గణేష్ పండగ సమయంలో ఈ దేవాలయానికి వేలసంఖ్యలో భక్తులు వస్తుంటారు.
పుణె- మయూరేశ్వర్ దేవాలయం
అష్ట వినాయక దేవాలయాల్లో ఒకటైన ఈ దేవాలయం పుణెకి దగ్గరలో మోరెగావ్ ప్రాంతంలో ఉంది. ఈ దేవాలయంలోని విగ్రహం, నల్లరాతితో చేయబడి ఉంటుంది. ఈ గుడిని 14 నుండి '17శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించారని నమ్ముతారు. త్రినేత్ర గణపతి దేవాలయం: ఈ దేవాలయాన్ని 1301 సంవత్సరంలో నిర్మించారని చెబుతారు. రాజస్థాన్ లోని రణతంబోర్ కోటలో ఉన్న ఈ దేవాలయాన్ని సందర్శించడానికి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు.