Page Loader
Happy Father's Day: ఫాదర్స్ డే స్పెషల్.. మీ నాన్నకు ఈ కోట్స్‌తో ప్రేమతో శుభాకాంక్షలు చెప్పండి!
ఫాదర్స్ డే స్పెషల్.. మీ నాన్నకు ఈ కోట్స్‌తో ప్రేమతో శుభాకాంక్షలు చెప్పండి!

Happy Father's Day: ఫాదర్స్ డే స్పెషల్.. మీ నాన్నకు ఈ కోట్స్‌తో ప్రేమతో శుభాకాంక్షలు చెప్పండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2025
02:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

తండ్రి అనే మాటను మనం తక్కువగా ఉపయోగించినా, ఆయన పట్ల ఉన్న అనుబంధం మాత్రం ఎంతో లోతుగా ఉంటుంది. నాన్న అంటే.. చెమటతో తడిసిన దుస్తుల వెనుక మహత్తరమైన కలలతో మన కోసం పని చేసే గొప్ప వ్యక్తి. ఆయన కళ్లలో ఎప్పుడూ మన భవిష్యత్తు ప్రకాశించాలని కోరుకునే తపన కనిపిస్తుంది. తండ్రి ప్రేమ అట్టడుగు నుంచి వస్తుంది. పదాల్లో కాదు, మన జీవితాన్ని సుఖంగా చేయాలనే పోరాటంలో ప్రతిఫలిస్తుంది. తల్లి ప్రేమను చాలామంది సులభంగా అనుభవించగలుగుతారు. కానీ తండ్రి ప్రేమ మాత్రం అంత తేలిక కాదు. ఆయన మనతో ఎక్కువ సేపు గడిపేరు. కానీ నిరంతరం మన కోసం ఆలోచిస్తూనే ఉంటారు. మన విజయాల వెనక నిలిచే మూలాధారశక్తి తండ్రే.

Details

ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలివే

ప్రతేడాది జూన్ మూడో ఆదివారం 'ఫాదర్స్ డే'గా జరుపుకుంటాం. ఈ ఏడాది ఫాదర్స్ డే జూన్ 15న రాబోతోంది. ఈ సందర్భంగా మీ నాన్నకు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పేందుకు కొన్ని హృదయాన్ని తాకే సందేశాలు దేవుడు నాకు ఇచ్చిన అద్భుత బహుమతి నాన్న. ఆయన లేకుండా జీవితం అసంపూర్తిగా అనిపిస్తుంది. హ్యాపీ ఫాదర్స్ డే! "తండ్రి ఎన్నో త్యాగాలు చేస్తాడు. కానీ అవి ఎప్పుడూ ముఖంలో కాకుండా చిరునవ్వులో కనిపిస్తాయి. మనల్ని ఈ లోకానికి పరిచయం చేసింది తల్లి అయితే, దాన్ని ఎదుర్కొంటూ ముందుకు నడిపించేది నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే! తన జీవితాన్ని త్యాగం చేసి.. మనల్ని మెరుగైన జీవితానికి నడిపించే గొప్పదనం తండ్రిలోనే ఉంది.

Details

ఇలా విష్ చేయండి

ప్రియమైన నాన్న, మీ వల్లే నాకు ఈ అద్భుతమైన జీవితం లభించింది. మీరు ఎప్పుడూ ఉత్తమమైనదే ఇచ్చారు. ఫాదర్స్ డే శుభాకాంక్షలు కొన్ని సార్లు మిమ్మల్ని బాధపెట్టినా, ఇకపై గర్వంగా, సంతోషంగా ఉంచడానికి కష్టపడతానని మాట ఇస్తున్నాను చిన్నప్పుడు నా వేళ్లను పట్టుకుని నడవడం నేర్పించిన మీరు.. జీవితంలో ముందుకు సాగేందుకు ప్రోత్సహించిన వ్యక్తి. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న! నన్ను నీడలో ఉంచి ఎండను తట్టుకునే మీరు నా తండ్రి రూపంలో దేవుడే. మీ త్యాగాలు ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా తక్కువే. మీరు నా జీవితంలో మొదటి హీరో. జేబుల్లో డబ్బులు లేకున్నా, నాకు అవసరమైనవన్నీ తీర్చిన నాన్న. అప్పుడు తెలుసుకున్నాను - నా తండ్రి కంటే ధనవంతుడు ఎవ్వరూ లేరు