
Diwali Festival 2025: దీపావళి పండుగ.. కేవలం ఒక రోజు కాదు, ఐదు రోజుల సంబరం
ఈ వార్తాకథనం ఏంటి
ఇంటిల్లిపాది ఘనంగా, ఆనందప్రదంగా జరుపుకునే దీపావళి పండుగ వచ్చేసింది. ఈ పండుగ చీకటి గోడలను తొలగించి జీవితంలో వెలుగు, ఆనందం, సంతోషాన్ని నింపుతుంది. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య నాడు భక్తి, శ్రద్ధతో లక్ష్మీదేవిని ఆరాధించడం దీపావళి ప్రత్యేకత. నిజానికి దీపావళి కేవలం ఒక రోజు పండుగ కాదు; ఇది ఐదు రోజుల పాటు జరుపుకునే సంబరం. సనాతన ధర్మం ప్రకారం, దీపావళి పండుగ ఐదు రోజులుగా జరుపుకుంటారు: త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, కార్తీక శుక్ల పాడ్యమి, విదియ. ఈ ఐదు రోజుల పండుగలన్నీ కలిపి దీపావళిగా వ్యవహరిస్తారని సనాతన ధర్మం చెబుతోంది. ఇంతకీ ఈ పండుగ ఎప్పుడు? లక్ష్మీపూజ ఎన్నింటికి చేసుకోవాలి?
వివరాలు
దీపావళి తేదీ 2025
దృక్సిద్ధాంత గణితం ప్రకారం, ప్రదోషకాల సమయంలో, సాయంత్రం,రాత్రి వేళల్లో అమావాస్య తిథి వ్యాప్తి ఉన్న రోజే దీపావళి జరుపుకోవాలి. ఈ లెక్క ప్రకారం: అక్టోబర్ 20, మధ్యాహ్నం 3.42 గంటలకు అమావాస్య ప్రారంభం అక్టోబర్ 21, సాయంత్రం 5 గంటలకు ముగింపు అందువల్ల, అక్టోబర్ 20నే దీపావళి జరుపుకోవడం శ్రేష్ఠం. అదే రోజు లక్ష్మీపూజ, పితృదేవతలకు దీపాలు చూపించడం, దీపదానం వంటి పుణ్యకార్యాలు చేయడం విశేషమైన ఫలితాలను ఇస్తాయి. లక్ష్మీ పూజ ముహూర్తం అక్టోబర్ 20, సాయంత్రం 7 నుంచి రాత్రి 8:30 వరకు ప్రదోషకాల సాయంత్రం 5:45 నుంచి 8:15 వరకు కూడా పూజ, దీపదానం మొదలైన శుభకార్యాలకి ప్రత్యేక ఫలితాలు ఉంటాయి.
వివరాలు
ఐదు రోజుల దీపావళి విశేషాలు
Day 1 & 2: ధనత్రయోదశి (అక్టోబర్ 18, శనివారం) ఈ ఏడాది శని త్రయోదశి, ధనత్రయోదశి ఒకే రోజుకు వస్తాయి. చతుర్వర్గ చింతామణి గ్రంథం ప్రకారం, ఈ రోజున లక్ష్మీపూజతో పాటు గోత్రిరాత్ర వ్రతం ఆచరించాలి. ధనత్రయోదశి రోజున ప్రదోషకాలలో లక్ష్మీదేవిని పూజించినవారికి దారిద్ర్యం తొలగి, దేవీ ఆశీర్వాదాలు లభిస్తాయి. పితృదేవతలకు దక్షిణముఖంగా దీపాలు వెలిగించడం శ్రేష్ఠం. అనేక ప్రాంతాల్లో ధనత్రయోదశిని ధన్వంతరి జయంతిగా కూడా జరుపుతారు.
వివరాలు
ఐదు రోజుల దీపావళి విశేషాలు
Day 3: నరక చతుర్దశి (అక్టోబర్ 19, ఆదివారం) నరక చతుర్దశి రోజున నువ్వుల నూనెతో తైలాభ్యంగ స్నానం చేయడం శ్రేయస్కరం. శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో నరకాసురుని సంహరించిన రోజు కూడా ఇదే. ఈ రోజున దీపదానం చేయడం,లక్ష్మీదేవిని సాయంత్రం పూజించడం శాస్త్రవచనం. Day 4: బలిపాడ్యమి (అక్టోబర్ 22, బుధవారం) బలిపాడ్యమి రోజు ప్రహ్లాదుని మనవడు బలి దానశీలత, ప్రజలకోసం చేసిన సేవలకు గుర్తుగా జరుపుకుంటారు. వామన అవతారంలో శ్రీమహావిష్ణువు బలిని పాతాళానికి తీసుకెళ్లిన రోజు ఇది. ఈ రోజున తలస్నానం, దీపదానం,వామన అవతార పురాణాల చదవడం ఫలప్రదం. మథురలో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఇంద్రుడి అహంకారాన్ని నాశనం చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుని గోమాతను పూజిస్తారు.
వివరాలు
Day 5: భగినీ హస్త భోజనం (అక్టోబర్ 23, గురువారం)
ఈ రోజు సోదరి చేతివంట తినడం శ్రేయస్కరం. సోదరిగా ఇష్టమైన వస్త్రాలు, ధనం లేదా ఇతర వస్తువులు ఇచ్చి ఆనందించించడం ద్వారా సోదరుడు లక్ష్మీ కటాక్షం పొందుతాడు. వివాహమైన సోదరి అయినా ఆత్మీయతను నిలుపుకుని ఆ ఆనందం పంచుకోవడం ముఖ్యమే. ఈ రీతిగా, ఐదు రోజుల దీపావళి పండుగ ప్రతి రోజూ ప్రత్యేకతతో, శుభకార్యాలతో, పూజలతో నింపబడుతుంది. ప్రతి రోజు మన జీవితంలో ఆనందం, శ్రేయస్సు, దారిద్ర్య నిర్మూలన మరియు లక్ష్మీప్రాప్తికి తోడ్పడుతుంది.