మీ ఆహారంలో బీన్స్ తీసుకుంటున్నారా? బీన్స్ చేసే మేలు తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
బీన్స్ (చిక్కుళ్ళు) లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీన్స్ లో చాలా రకాలున్నాయి.
కిడ్నీ బీన్స్, సోయాబీన్, బ్లాక్ బీన్స్.. ఇలా ఎన్నో రకాలున్నాయి. ప్రస్తుతం బీన్స్ ఎందుకు తినాలో ఇక్కడ తెలుసుకుందాం.
బీన్స్ లో అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అమైనో ఆమ్లాలు ప్రోటీన్ ఉత్పత్తిలో ఉపయోగపడతాయి. శరీర కణజాలాలు ఏర్పడాలంటే ప్రోటీన్ చాలా అవసరం.
ప్రోటీన్ లోపం ఏర్పడితే జుట్టు రాలిపోవడం, చర్మ సమస్యలు ఇలా రకరకాల ఇబ్బందులు వస్తాయి.
బరువు పెరగకుండా చేసే బీన్స్:
ఆహారంలో బీన్స్ చేర్చుకోవడం మీరు బరువు పెరగకుండా, సన్నని నడుముతో, నాజూకైన శరీరంతో ఉంటారు. ఇందులోని పోషకాలు మీ బరువు పెరగకుండా చూసుకుంటాయి.
Details
చక్కెర వ్యాధిని నియంత్రణలో ఉంచే బీన్స్:
రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రణలో ఉంచడంలో బీన్స్ ఉపయోగపడతాయి. అలాగే బీపీని నియంత్రించడంలో తోడ్పడతాయి. ఈ సాయం చేయడంలో గ్రీన్ బీన్స్ కు సాటి లేదు.
ఐరన్ అందిస్తుంది:
మీ శరీరమంతటా ఆక్సిజన్ సరఫరా చేసే హీమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ అవసరం. హీమోగ్లోబిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోతే శరీరానికి ఆక్సిజన్ అందదు.
ఐరన్ లోపం రాకుండా ఉండేందుకు బీన్స్ సాయం చేస్తాయి. ఈ విషయంలో సోయాబీన్ మంచి మేలు చేస్తుంది.
మెగ్నీషియం లోపాన్ని నివారిస్తుంది:
బ్లాక్ బీన్స్ లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఒక కప్పు బీన్స్ లో 120మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది.