Foods to Improve Female Egg Quality: మహిళల్లో అండాశయాల నాణ్యతను మెరుగుపరచడానికి వీటిని ప్రతిరోజూ తినండి
మనదేశంలో పిల్లల పుట్టక ఇబ్బంది పడుతున్న జంటలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో భార్యలో సమస్య ఉంటే, మరికొన్నిసార్లు భర్తలో ఆరోగ్య సమస్యలు కారణమవుతాయి. అందుకే స్త్రీలు, పురుషులు తమ పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యంగా మారింది. మహిళల్లో ఆరోగ్యకరమైన అండాలు ప్రతీ నెలా విడుదలవ్వాలి, అప్పుడు మాత్రమే గర్భం ధరించడం సులభంగా ఉంటుంది. ఈ క్రమంలో అండాశయాల ఆరోగ్యాన్ని మెరుగుపరచే కొన్నిఆహారాలు కొన్ని ఉన్నాయి
అండాల ఆరోగ్యం
అండాల ఆరోగ్యం అనేది పునరుత్పత్తి హార్మోన్ల సరైన పనితీరుకు సూచిస్తుంది. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు అండాశయాలను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి, ఆహారం, జీవనశైలి, మానసిక స్థితి ఈ హార్మోన్లపై ప్రభావం చూపుతాయి. పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని ప్రత్యేకమైన ఆహారాల తీసుకోవడం ద్వారా అండాశయాల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. ఆకుపచ్చని కూరలు పాలకూర, కాలే వంటి ఆకుపచ్చని కూరగాయలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లలో పుష్కలంగా ఉంటాయి. ఫోలేట్ వంటి పోషకాలు అండాల ఉత్పత్తి, అండోత్సర్గం నియంత్రణలో సహాయపడతాయి. వీటిని వారానికి కనీసం రెండు మూడు సార్లు తీసుకోవడం ద్వారా అండాశయాల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
అవిసె గింజలు
అవిసె గింజలు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, లిగ్నాన్స్ వంటి పోషకాలను అందిస్తాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. అవిసె గింజల్లో ఉండే లిగ్నాన్స్ ఈస్ట్రోజన్ స్థాయిలను సమతుల్యంలో ఉంచుతాయి, ఇది ఆరోగ్యకరమైన అండాశయాలకు దోహదం చేస్తుంది. బెర్రీ పండ్లు బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్పెబెర్రీలు వంటి పండ్లు యాంటీ ఆక్సిడెంట్లలో అధికంగా ఉంటాయి. ఇవి కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడటంలో, శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తగ్గించడంలో సహాయపడతాయి. పిసిఓఎస్ సమస్యలతో బాధపడే మహిళలు బెర్రీ పండ్లను వారి ఆహారంలో చేర్చుకోవడం ఎంతో అవసరం.
నట్స్
పొద్దుతిరుగుడు గింజలు, వాల్ నట్స్, బాదం వంటి గింజలు హార్మోన్ల సంతులనంలో కీలకంగా ఉంటాయి. వీటిలో మెగ్నీషియం, సెలీనియం వంటి పోషకాలు హార్మోన్ల అసమతుల్యత సమస్యను అడ్డుకుంటాయి. అవకాడోలు అవకాడోలు స్త్రీల పునరుత్పత్తి ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఫోలేట్, మోనో శాచ్యురేటెడ్ కొవ్వులు ఉండడం వలన అండోత్సర్గాన్ని మెరుగుపరచడంలో, గర్భం ధరించడంలో సహాయపడతాయి. సాల్మన్ చేప సాల్మన్ చేపలు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ డి వంటి పోషకాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి అండాశయాలపై తిత్తులు, వాపు వంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి.