Number plate for vehicles: ఫ్యాన్స్ నుంచి ఇండియాకి.. వాహనాలకు నంబర్ పేట్ల వ్యవస్థ ఎలా వచ్చిందంటే?
ప్రతి వాహనానికి నంబర్ ప్లేట్ ఉండటం తప్పనిసరి. దీనిద్వారా ఆ వాహనం గురించి వివరణాత్మక సమాచారం తెలుసుకోవచ్చు. ఈరోజు మనం ఈ నంబర్ ప్లేట్ల ఉద్భవం, వాటి ఉపయోగం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. కారు, బైక్, ట్రక్ వంటి ఏ వాహనానికైనా నంబర్ ప్లేట్ చాలా ముఖ్యమైంది. నంబర్ ప్లేట్ ద్వారా వాహనం ఏ రాష్ట్రంలో, ఏ నగరంలో నమోదు అయిందో తెలుసుకోవచ్చు. ఇది వాహన యజమాని అధికారిక వివరాలు, రిజిస్ట్రేషన్ నంబర్ వంటి సమాచారాన్ని అందిస్తుంది. వాహనాలకు నంబర్ ప్లేట్లు ఉండడం రహదారి భద్రత, వాహనాలను గుర్తించేందుకు అవసరమైంది. ప్రతి వాహనానికి ప్రత్యేక నంబర్ ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ వివరాలు సులభంగా ట్రాక్ చేయవచ్చు.
మొదటిసారిగా ఫ్యాన్స్ దేశంలో నంబర్ పేట్ల వ్యవస్థ
ఫ్రాన్స్ దేశం ఈ నంబర్ ప్లేట్లను మొదటిసారి 1893 ఆగస్టు 14న పారిస్ పోలీస్ ఆర్డినెన్స్ ద్వారా అమలు చేసింది. అంతకుముందు, రాయల్ కోచ్‌లకు కింగ్ లూయిస్ XVI ఆదేశంతో నంబర్ ప్లేట్లు అమర్చారు. ఫ్రాన్స్‌ను అనుసరించి 1896లో జర్మనీ, 1898లో నెదర్లాండ్స్ కూడా నంబర్ ప్లేట్లను తమ వాహనాలపై అమలు చేయడం మొదలు పెట్టాయి. ఇంగ్లాండ్‌లో 1903లో మోటార్ కార్స్ యాక్ట్ ద్వారా నంబర్ ప్లేట్లను తప్పనిసరి చేశారు. భారతదేశంలో నంబర్ ప్లేట్ విధానం 1900లలో మొదలై, 1939లో కేంద్ర ప్రభుత్వం నంబర్ ప్లేట్లకు సంబంధించి ప్రత్యేక నియమాలు, రూపకల్పనను ఏర్పాటు చేసింది. అప్పటినుండి, భారతదేశంలో నంబర్ ప్లేట్లు ప్రతి వాహనానికి తప్పనిసరగా మారాయి.