LOADING...
Raksha Bandhan : స్మార్ట్‌వాచ్‌ల నుంచి జియో ట్యాగ్‌ వరకు.. ఈ రాఖీకి సోదరికి ఇచ్చేందుకు అద్భుతమైన గిఫ్ట్స్ ఇవే!
స్మార్ట్‌వాచ్‌ల నుంచి జియో ట్యాగ్‌ వరకు.. ఈ రాఖీకి సోదరికి ఇచ్చేందుకు అద్భుతమైన గిఫ్ట్స్ ఇవే!

Raksha Bandhan : స్మార్ట్‌వాచ్‌ల నుంచి జియో ట్యాగ్‌ వరకు.. ఈ రాఖీకి సోదరికి ఇచ్చేందుకు అద్భుతమైన గిఫ్ట్స్ ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2025
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాఖీ పండుగ - సోదరులు, సోదరీమణుల మధ్య అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రత్యేక రోజు. 2025లో ఈ పవిత్ర పండుగ ఆగస్టు 9న జరుపుకుంటారు. ఆ రోజు రాఖీ కట్టడం మాత్రమే కాదు, ప్రేమకు గుర్తుగా బహుమతులనూ ఇచ్చుకునే సందర్భం. మీరు కూడా ఈ రక్షా బంధన్‌కు మీ సోదరికి అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారా? అయితే రూ.1000 లోపు ధరలో లభించే టెక్ గాడ్జెట్ల గురించి ఓ లుక్కేయండి.

Details

హెయిర్ స్ట్రెయిట్నర్ 

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో రూ.1000 లోపలే మంచి హెయిర్ స్ట్రెయిట్నర్‌లు దొరుకుతాయి. ఇవి రోజూ హెయిర్ స్టైలింగ్‌ చేసే వారికి ఉపయుక్తంగా ఉంటాయి. స్టైలిష్‌గా ఉండటాన్ని ఇష్టపడే మీ సోదరికి ఇది బెస్ట్ గిఫ్ట్ కావచ్చు. జియో ట్యాగ్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం రూపొందించిన జియో ట్యాగ్‌ అమెజాన్‌లో రూ.999కి లభిస్తోంది. ప్రయాణాలు చేసే వారు తమ బ్యాగులు, కీలు, ఇతర వస్తువులు ఎక్కడ పోయాయో ఈ ట్యాగ్ ద్వారా ట్రాక్ చేయొచ్చు. ఇందులో ఉన్న 120డిబి స్పీకర్ తో వస్తువు లొకేషన్‌ ఈజీగా గుర్తించొచ్చు.

Details

 స్మార్ట్ వాచ్ 

రూ.1000 లోపు ధరకు కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బ్లూటూత్ కాలింగ్, హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. డిజిటల్ లైఫ్‌స్టైల్‌కు అలవాటైన వారికి ఇది అద్భుతమైన బహుమతి. ఇతర గాడ్జెట్లు ఇయర్‌బడ్స్, హెయిర్ డ్రయర్లు, పవర్ బ్యాంకులు, పోర్టబుల్ స్పీకర్లు వంటి ఇతర గాడ్జెట్లు కూడా రూ.1000 లోపే లభిస్తాయి. ఇవి కూడా రాఖీ సందర్భంగా బహుమతులుగా ఎంపిక చేసుకోవచ్చు. సేల్స్ స్పెషల్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు స్వాతంత్ర్య దినోత్సవ సేల్స్ నిర్వహిస్తున్నాయి. ఇందులో శాంసంగ్ గెలాక్సీ S24 వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. మీరు సోదరికి లేదా మీకే ఓ ప్రీమియం గిఫ్ట్ కొనాలనుకుంటే.. ఈ అవకాశాన్ని మిస్ కాకండి!