
Labour Day 2025 : ఈ మే డే సందర్భంగా.. శ్రమను ఆదరించి, ప్రతిభను వెలిగిద్దాం!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ సంవత్సరం మే 1వ తేదీన మనం "మేడే" లేదా "అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం" (Labour Day 2025) జరుపుకుంటామని అందరికీ తెలిసిన విషయమే.
మే డే జరుపుకునేందుకు ప్రధానంగా రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
ఆ రోజున కార్మికులు తమ హక్కులను గుర్తు చేసుకోవడం,వారి సేవలకు తగిన గౌరవాన్ని ఇవ్వడం, వారిని సన్మానించడం.
కార్మిక దినోత్సవం మూలాలు 19వ శతాబ్దంలో ఆరంభమయ్యాయి.అప్పుడు అమెరికాలో కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం ప్రారంభించారు.
1886 మే 1న సుమారు 2 లక్షల మంది కార్మికులు 8 గంటల పనిదినం కోసం భారీ సమ్మెకు దిగారు.
అదేవిధంగా, మంచి పనివాతావరణం, తక్కువ వేతనాలు, బాల కార్మికుల సమస్యలు వంటి అంశాలపై కూడా పోరాటం జరిపారు.
వివరాలు
శాంతియుత సమ్మేళనంలో బాంబు
ఈ ఉద్యమం అమెరికా నుండి ఐరోపా దేశాలకు విస్తరించింది. షికాగోలో ఈ ఉద్యమం ఒక హింసాత్మక సంఘటనగా మారింది.
షికాగో నగరంలోని హేమార్కెట్ స్క్వేర్‌లో జరిగిన శాంతియుత సమ్మేళనంలో బాంబు పేలడంతో అది విషాదంగా మారింది.
ఈ ఘటనలో పోలీసులూ, సమ్మెలో ఉన్న కార్మికులూ ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన తరువాత, ప్రభుత్వమే ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకొని, 1894లో కార్మిక దినోత్సవాన్ని స్థాపిస్తూ, ఆ రోజును సెలవు దినంగా ప్రకటించింది.
1916లో తొలిసారిగా 8 గంటల పనిదినం డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించింది.
వివరాలు
హౌరా రైల్వే స్టేషన్లో పనిగంటల కోసం సమ్మె
భారతదేశంలో 1923 మే 1వ తేదీన తొలిసారిగా కార్మిక దినోత్సవాన్ని జరుపుకున్నారు.
అయితే, మన దేశంలో 1862లోనే కలకత్తాలో కార్మికులు హౌరా రైల్వే స్టేషన్లో పనిగంటల కోసం సమ్మె నిర్వహించారు.
1923లో ఈ సందర్భాన్ని అధికారికంగా మే డేగా గుర్తించారు.1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడిన తరువాత కార్మిక వర్గాల్లో చైతన్యం పెరిగింది.
అయితే, ప్రైవేటైజేషన్,లిబరలైజేషన్,గ్లోబలైజేషన్ (ఎల్పీజీ)పరిణామాల వల్ల 1985 తరువాత అసంఘటిత కార్మిక వర్గాలకు సంబంధించి చట్టాలు అమలవడంలో విఘ్నాలు ఏర్పడ్డాయి.
రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఐరోపాలోని కొన్ని దేశాలు మే 1వ తేదీన సెలవు ప్రకటించడం ప్రారంభించాయి.
తరువాత అనేక దేశాలు ఈ దిశలోనే అడుగులు వేసాయి.వివిధ దేశాలలో కార్మికుల సంక్షేమ పథకాలు ఈ రోజు అమలు చేయడం ప్రారంభమైంది.
వివరాలు
ఈ రోజును వివిధ భాషలలో ఈ విధంగా పిలుస్తారు:
హిందీలో "కామ్‌గర్ దిన్"
కన్నడలో "కార్మికర దినచరనే"
మరాఠీలో "కమ్‌గర్ దివస్"
బెంగాలీలో "ష్రోమిక్ దిబోష్"
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 80కి పైగా దేశాలు కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.
సామాజిక న్యాయం, అందరికీ గౌరవప్రదమైన పనులను ప్రోత్సహించడానికి 1919లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) స్థాపించబడింది.
ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కులను సాధించడంలో, అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలను ఏర్పరచడంలో కీలక పాత్ర పోషిస్తోంది.