Ghee Coffee : నెయ్యి కాఫీ ప్రయోజనాలివే.. తయారీ విధానం తెలుసా
కాఫీ, టీ అంటే తెలియని వారు ఉండరు. కానీ ఇప్పుడంతా ట్రెండ్ మారింది.రిసిపీలు సైతం మారుతున్నాయి. ఇందులో భాగంగానే నెయ్యి కాఫీ ఇటీవలే ఫేమస్ అయ్యింది. మరోవైపు సినీనటులు,పేరు మోసిన పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలు నెయ్యి కాఫీని ఇష్టంగా తాగేస్తున్నారు. ఈ కాఫీ తీసుకోవడం వల్ల వాపు తగ్గించడంలో సహకరిస్తుంది. పేగు లైనింగ్‌కు ఉపకారిగా పనిచేస్తుంది.అంతేనా, హార్మోన్ ఉత్పత్తిని సైతం మెరుగుర్చి మానసిక స్థితిని బలపర్చి, ఏకాగ్రతను పెంచేలా చేస్తుంది. నెయ్యి కాఫీ రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నెయ్యి కాఫీ ప్రయోజనాలు : నెయ్యి కాఫీ, జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. నెయ్యి కాఫీ రుచికరమైందే కాదు, ఆరోగ్యకరమైంది కూడానూ. బరువు తగ్గించడంలో గీ కాఫి తోడ్పడుతుంది.
నెయ్యిలో విటమిన్ A, E, K పుష్కలంగా ఉన్నాయి
పొట్టలోని యాసిడ్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. నెయ్యిలో ఎక్కువ మొత్తంలో కాల్షియం యాసిడ్ పరిమాణాన్ని తగ్గిచేస్తుంది. నెయ్యి కాఫీ వల్ల జీర్ణక్రియకు మంచి జరుగుతుంది.ఇది ఆహారాన్ని జీర్ణం చేస్తుంది.నెయ్యి కాఫీ కారణంగా వాపును తగ్గించడంలో పేగు లైనింగ్‌కు సహాయకారిగా ఉపకరిస్తుంది.హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఇది మానసిక స్థితిని,ఏకాగ్రతను పెరిగేలా చేస్తుంది.నెయ్యిలో విటమిన్ A, E, K పుష్కలంగా ఉన్నాయి. ఆకలిని తగ్గించేస్తుంది. ఫలితంగా బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది.మొండి కొవ్వులను కరిగించటంలోనూ గీ కాఫీది కీలక పాత్ర. నెయ్యి కాఫీ ఎలా తయారీ : ముందుగా కాఫీ పొడిని నీటిలో వేయాలి. అది మరిగుతున్న క్రమంలో అందులో నెయ్యి వేయాలి. మరికొంత సేపు కాగనిచ్చి అనంతరం ఈ మిశ్రమాన్ని పాలల్లో కలిపితే నెయ్యి కాఫీ రెఢీ.