
Harish Shankar : హిందూ ధర్మంపై డైరెక్టర్ హరీష్ శంకర్ సంచలన ట్వీట్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ హిందూ ధర్మంపై సంచలన ట్వీట్ చేశారు.
ఓ వైపు హిందూ ధర్మాన్ని విదేశీయులే గౌరవిస్తున్నారని, మరోవైపు సొంత ప్రజలే దాన్ని విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో హరీష్ శంకర్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజా పోస్టులో ఓ విదేశీయుడు భగవంతుడికి, భక్తునికి మధ్య బంధాన్ని చక్కగా వివరించారు. భగవంతుడు అంటే కృష్ణుడనిన ఆయనో అందానికి ప్రతీరూపమన్నారు.
చిటికెన వేలితో గోవర్థన గిరిని ఎత్తగలిగాడని స్తుతించారు. మనం కేవలం భగవంతుడికి భక్తులం మాత్రమేనన్నారు.
భారతీయుడిగా పుట్టి భగవంతుడినే ధ్యానించకపోతే జంతువుతో సమానమని విదేశీయుడు వీడియోలో చెప్పిన అంశాలను టాలీవుడ్ డైరెక్టర్ షేర్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హిందూ ధర్మంపై స్పందించిన హరీష్ శంకర్
While it reaches beyond boundaries our own people wanna eradicate it #sanatanadharma pic.twitter.com/Juq0YI48dF
— Harish Shankar .S (@harish2you) November 15, 2023