
Mushroom In Winter: చలికాలంలో పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
పుట్టగొడుగులను ప్రయోజనాల పుట్టగా చెప్పొచ్చు. ఇందులో సహజ పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
మాంసంహారం తినని వాళ్లు పుట్టగొడుగులను తప్పనిసరిగా తమ ఆహారంలో చేర్చుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
ముఖ్యంగా శీతాకాలంలో ప్రత్యేకంగా తినాల్సిన కొన్ని ఆహారాలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
చలికాలంలో పుట్టగొడుగులు రెగ్యులర్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇక పుట్టగొడుగుల్లో ప్రోటిన్, అమినో యాసిడ్స్, విటమిన్ డి, బి2, బి3 పుష్కలంగా ఉంటాయి.
విటమిన్ డి లోపం ఉన్నవారు ప్రతి రోజూ పుట్టగొడుగులను తినడం మంచిదని వైద్యులు తెలిపారు.
Details
బరువు తగ్గడానికి పుట్టగొడుగులు సాయపడతాయి
ప్రధానంగా చలికాలంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులు తింటే రోగ నిరోధక మెరుగుపడుతుంది.
పుట్టగొడుగులు ఎముకల ఆరోగ్యాన్ని సాయపడతాయి.
సోడియం తక్కువగా, పొటాషియం తక్కువగా ఉండే పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకుంటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే సామర్థ్యం వాటికి ఉంది. ముఖ్యంగా రెగ్యులర్ తీసుకుంటే గుండెకు కూడా మంచిదే.
ఇది బరువు తగ్గడానికి అవసరమైన పోషకాలను కూడా కలిగి ఉంటుంది.
అమైనో ఆమ్లాలు, కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులను తింటే, కొన్ని రకాల క్యాన్సర్లకు చెక్ పెట్టొచ్చు.