
ఒత్తిడిని తగ్గించడం నుండి జీర్ణ సంబంధ సమస్యలను దూరం చేసే పుదీనా ప్రయోజనాలు
ఈ వార్తాకథనం ఏంటి
కూరలకు, సలాడ్లకు, కాక్ టెయిల్ వంటి వాటికి అదనపు రుచిని, ఫ్లేవర్ ని అందించే పుదీనా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యానికి పుదీనా ఎంతో హెల్ప్ చేస్తుంది.
ప్రస్తుతం పుదీనా వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
జీర్ణ సమస్యలు దూరం:
పుదీనా తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు దూరం అవుతాయి. ఆహారం జీర్ణం కాక ఇబ్బంది పడుతున్న వారు పుదినాను తీసుకోవచ్చు.
అలాగే కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారు పుదీనాను తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతారు.
తలనొప్పి, మైగ్రేన్ దూరం:
పుదీనా వాసన చాలా బాగుంటుంది. మీకు తలనొప్పి కలిగినా లేదా మైగ్రేన్ తో బాధపడుతున్నా పుదీనా వాసన వల్ల మంచి ఉపశమనం దొరుకుతుంది.
Details
యాంగ్జయిటీని తగ్గిస్తుంది
పుదీనా వాసన బాగుంటుందని ఇంతకు ముందే చెప్పుకున్నాం. దీని కారణంగా మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది.
అంతేకాదు యాంగ్జయిటీని తగ్గించడంలో పుదీనా ప్రముఖ పాత్ర వహిస్తుంది.
శ్వాస సంబంధ సమస్యలను దూరం చేస్తుంది:
శ్వాస సంబంధ సమస్యలతో బాధపడేవారు తమ ఆహారంలో పుదీనాను చేర్చుకోవాలి. దీని కారణంగా మూసుకుపోయిన గాలినాళాలు తెరుచుకుంటాయి.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించడంలో పుదీనా ఎంతో సహాయపడుతుంది.
మెదడు పనితీరును మెరుగు చేస్తుంది:
పుదీనాలోని పోషకాల వల్ల మెదడు పనితీరు మెరుగ్గా తయారవుతుంది.