
ఆరోగ్యం: తలనొప్పి నుండి ఉపశమనం అందించే ఆయిల్స్ ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
అరోమాథెరపీని కొన్ని వేల యేళ్ళుగా ఉపయోగిస్తున్నారు. టెన్షన్, అసౌకర్యాన్ని తగ్గించడంలో అరోమాథెరపీ చాలా బాగా ఉపయోగపడుతుంది.
అరోమాథెరపీలో అనేక ఆయిల్స్ వాడతారు. ప్రకృతిలో విరివిగా పెరిగే మొక్కల నుండి సేకరించిన పదార్థాల ద్వారా ఈ ఆయిల్స్ తయారవుతాయి.
ప్రస్తుతం తలనొప్పిని తగ్గించే ఆయిల్స్ గురించి తెలుసుకుందాం.
లావెండర్ ఆయిల్:
ఒత్తిడిని, యాంగ్జాయిటీని తగ్గించేసి, ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది లావెండర్ ఆయిల్. దీని వాసన పీల్చడం వల్ల మైగ్రేన్ నొప్పి తగ్గుతుంది.
దీనికోసం మీరేం చేయాలంటే, లావెండర్ నూనెలో కొంత నీరు కలిపి చర్మానికి మర్దన చేసుకోవాలి. లేదంటే స్నానం చేసే నీళ్ళలో కొన్ని చుక్కల లావెండర్ నూనెను కలపండి.
Details
కొబ్బరి నూనెలో కలుపుకుని వాడాల్సిన ఆయిల్స్
యూకలిప్టస్ ఆయిల్:
సైనస్ సమస్యల వలన తలనొప్పి కలిగినట్లయితే యూకలిప్టస్ ఆయిల్ మేలు చేస్తుంది. ముక్కు రంధ్రాలను తెరుచుకునేలా చేసి సైనస్ ఇబ్బందిని తగ్గించేస్తుంది.
దీనికోసం మీరు కొద్దిగా వంటనూనె తీసుకుని అందులో ఒకచుక్క యూకలిప్టస్ ఆయిల్ వేసి ఛాతి భాగానికి మర్దన చేసుకోవాలి.
రోజ్ మేరీ ఆయిల్:
కొబ్బరి నూనెలో కొన్నిచుక్కల రోజ్ మేరీ ఆయిల్ ని కలిపి, ఏ భాగంలో తలనొప్పి కలుగుతుందో ఆ భాగానికి మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
పెప్పర్మింట్ ఆయిల్:
కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల పెప్పర్మింట్ ఆయిల్ కలుపుకుని మీ కణతల భాగంలో మర్దన చేయాలి. దీనివల్ల తలనొప్పి నెమ్మదిగా తగ్గిపోయి ప్రశాంతంగా ఉంటుంది.