
శరీరంలోని అనారోగ్య లక్షణాలను పెదవులు ఎలా తెలియజేస్తాయో చూడండి
ఈ వార్తాకథనం ఏంటి
మనిషి ముఖంలో పెదవులు అనేవి అందమైన భాగాలు. ఈ భాగాలకు అనారోగ్యాన్ని గుర్తించే లక్షణాలు ఉన్నాయి.
మీ శరీరంలో కలిగే అనారోగ్యాలను మీ పెదవుల్లో కలిగే మార్పుల ద్వారా తెలుసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉబ్బిన పెదవులు:
పెదవులకు మంట కలగడం, గొంతులో దురద, అలర్జీ కారణంగా పెదవులు ఉబ్బుతుంటాయి. దీన్ని తగ్గించడానికి ఐస్ ప్యాక్ తో మర్దన చేస్తే సరిపోతుంది. ఒకవేళ పెదవులు తీవ్రంగా ఉబ్బితే డాక్టరును సంప్రదించడం మంచిది.
లేత పెదవులు:
పెదవుల అంచులు ఎర్రగా మారిపోయి సున్నితంగా అనిపిస్తే, మీ పెదవులు లేతగా మారిపోయాయని అర్థం. టూత్ పేస్ట్, లిప్ స్టిక్ కారణంగా ఇలా జరిగే అవకాశం ఉంటుంది.
Details
రక్తహీనత వల్ల పెదాల రంగు మారిపోతుంది
పెదవుల రంగు మారిపోవడం:
మీ పెదవులు రంగు కోల్పోయి పేలవంగా మారినట్లయితే మీ శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగట్లేదని అర్థం. పొగ తాగడం, ఆల్కహాల్ సేవించడం, రక్తహీనత వంటి వాటివల్ల ఇలా జరిగే అవకాశం ఉంది.
ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే రోజూ వ్యాయామం చేయడం, సిగరెట్, మందు మానేయడం, పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవడం చేస్తుండాలి.
పెదవులు ఎర్రగా మారి మంటలు పుట్టడం:
ఈ లక్షణం, మీ శరీరంలో ఎక్కువ వేడి ఉందని తెలియజేస్తుంది. కెఫైన్, చక్కెర, కారం ఆహారాలు తగ్గించాలి.
పగిలిన పెదవులు:
డీహైడ్రేషన్, యాంగ్జాయిటీ, టెన్షన్ మొదలగు కారణాల వల్ల పెదవులు పగులుతుంటాయి. కొన్నిసార్లు వాతావరణంలో కలిగే మార్పుల వల్ల పెదవులు పగులుతాయి.