Jaggery : శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగాలంటే.. ఇంట్లోని బెల్లంతో ఇలా కరిగించుకోవచ్చు
ఆధునిక జీవన శైలి,పరుగుల జీవన విధానం వెరసి చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. పొట్ట,నడుములో కొవ్వుల కారణంగా అనేక అనారోగ్యాలను తెచ్చిపెడుతున్నాయి. అధిక బరువు,ఊబకాయం మన ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను బెల్లంతో కరిగించుకోవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు. జీవ క్రియను మెరుగుపరిచి : బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్లను శక్తిగా మార్చడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఫలితంగా క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. దీంతో కొవ్వు తరిగి బరువు తగ్గుతాం. జీర్ణ క్రియను మెరుగుపరిచి : ఇందులో పీచు ఎక్కువగా ఉండటంతో జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. చక్కటి అరుగుదలతో ఆహారం ఈజీగా జీర్ణం అవుతుంది. పీచుతో పొట్ట నిండిన భావనతో ఉంటుంది. దీంతో తక్కువగా తింటాం.
టీ, కాఫీ, స్వీట్లల్లో బెల్లం బెస్ట్
రక్తంలో చక్కెర స్థాయిపై కంట్రోల్ : శరీరంలో, రక్తంలో చక్కెర స్థాయిలు అధికమైతే బరువు పెరుగుతాం. పంచదారతో పోల్చితే బెల్లం గ్లైకమిక్ ఇండెక్స్ తక్కువ. దీంతో గ్లూకోజ్ తక్కువగా ఉంటుంది. ఫలితంగా ఒకేసారి రక్తంలో చక్కెర శాతం పెరగదు. ఇన్సులిన్ నియంత్రణలో ఉంటుంది.గ్లూకోజ్ పేరుకోకపోతే బరువు పెరగం కనుక చక్కెరకు బదులు టీ, కాఫీల్లో బెల్లం వినియోగం సేఫ్. రక్తహీనతను రాకుండా చూస్తుంది. ఎనర్జీ కోసం : బెల్లంని శక్తి కోసం వాడుతుంటారు. ఇందులో ఇనుము శాతం సమృద్ధిగా ఉంటుంది.దీని వల్ల శరీరం అంతటికీ సరిపడ ఆక్సిజన్ లభిస్తుంటుంది. మనం ఎక్కువగా శక్తివంతంగా ఉన్నామన్న ఫీలింగ్ వచ్చేసి ఉత్సాహంతో ఉంటాం. శరీరం అధిక శక్తిని ఖర్చు చేస్తున్న క్రమంలో క్యాలరీలు ఎక్కువగా కరిగిపోతాయి.