Air Pollution : మీ ఊపిరితిత్తులను రక్షించుకోవాలంటే ఇవి పాటించాల్సిందే
మానవ శరీరంలో ఊపిరితిత్తులు కీలక పాత్ర పోషిస్తాయి. ఊపిరి తీసుకోవడం, వదలడం రెండింట మధ్య సమన్వయం ఉంటేనే మనిషి మనుగడ సాఫీగా సాగిపోతుంది. ఈ మేరకు ఇన్ హేల్, ఎగ్జేల్ (inhale, Exhale) ప్రక్రియదే అగ్రభాగం. చలికాలంలో పండుగలు ఎక్కువ. ఇప్పటికే దసరా పూర్తైంది. అయితే ముందుంది అసలైన పండుగ దీపావళి. ఈ పండుగకు పటాకాలు స్పెషల్. దీంతో గాలిలో వాయు నాణ్యత సూచిక (AQI) స్థాయిలు ప్రమాదకరంగా మారతాయి. మనలో చాలా మంది అనారోగ్యానికి గురయ్యే సీజన్ కూడా ఇదే. అయినా బాథపడాల్సిందేం లేదు. గాలి కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచడంలో మీకు సహాయపడే కొన్ని ఆహార చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
యాంటీ ఆక్సిడెంట్లు పోషకాహారానికి అద్భుతమైన మాలాలు
యాంటీ ఆక్సిడెంట్లు : శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు కావాల్సిందే. ఇవి ఉంటే మీరు ఊపిరి బాగా పీల్చుకోవడానికి సహాయపడతాయి. అందుకే ఈ సీజన్‌లో వాటిని శరీరానికి అందించాలి. వాయు కాలుష్యం వల్ల మీ ఊపిరితిత్తుల్లో ఆక్సీకరణ తగ్గుతుంది. దీని కోసం పసుపు, బచ్చలికూర, బీట్‌రూట్, బెర్రీలు, యాపిల్స్, టొమాటోలు, ఆకుపచ్చ కూరగాయలు, నారింజ, గింజలను తినాలి. ఎందుకంటే అవి పోషకాహారానికి అద్భుతమైన మాలాలు. గ్రీన్ టీ తాగడం అదనపు బలంగా నిలుస్తుంది. ఇవి తగ్గించాల్సిందే : పాల ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించుకోవాలి. మీరు పీల్చేది విషపూరితమైన గాలి అనుకున్నప్పుడు పాల ఉత్పత్తులను నివారించడం చాలా మంచిది. ఎందుకంటే చాలా మందిలో పాలు, శ్వాసను మరింత దిగజార్చుతుంది.
పాల ఉత్పత్తులను పరిమితం చేయాలి
పాలు, పాల పదార్థాలను తీసుకోవడం వల్ల శ్లేష్మం ఉత్పత్తి పెరుగుతుందని జర్నల్ ఆఫ్ అలర్జీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో నివేదించింది. ఇందులో భాగంగా ఆస్తమా మరింత తీవ్రమవుతుందని వెల్లడించింది. అందువల్ల, పాల ఉత్పత్తులను పరిమితం చేయడం లేదా మానుకోవడం మంచిది. Omega-3 Fatty Acids : ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినండి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను తీసుకోవచ్చని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. వీటిలో ఉన్న శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.
ఆరోగ్యం కోసం ఇవి ప్రతిరోజూ తినాల్సిందే
ప్రతిరోజూ తినాలి : ఇవి మీ శరీరంలోని తెల్ల రక్త కణాలను సక్రియం చేయడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వాల్‌నట్‌లు, అవిసె గింజలు, చియా గింజలు, బచ్చలికూర, సోయాబీన్స్, మొలకలను ప్రతిరోజూ తినండి. కాలుష్యాన్ని తట్టుకుని నిలదొక్కుకోవాలంటే తగినంత నీరు తీసుకోవడం వల్ల మీ వాయుమార్గాల నుంచి అదనపు శ్లేష్మం తొలగిపోయి శ్వాసకోశ అసౌకర్యం దూరం అవుతుంది. ఈ మేరకు ప్రతి రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగేందుకు ప్రయత్నించాలి. అలాగే కొన్ని రుచికరమైన, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలుగా హెర్బల్ టీలు, కొబ్బరి నీరు, గ్రీన్ టీ లేదా నిమ్మ లేదా తేనెతో కూడిన వెచ్చని నీటిని సేవించవచ్చని నిపుణలు అంటున్నారు.