WORLD TOURISM DAY 2023 : పర్యాటకులను మైమరపించే మాల్దీవుల అందాలు
భారతదేశం నైరుతి దిక్కున హిందూ మహాసముద్రంలో కొన్ని పగడపు దీవులతో కలిసి ఏర్పడిన దేశం మాల్దీవులు. ఇక్కడ 26 పగడపు దిబ్బలతో కలిపి మొత్తం 1,196 దీవులున్నాయి. కేవలం 1.5 మీటర్ల ఎత్తులో ఉండటంతో పెరుగుతున్న సముద్ర నీటి మట్టంతో ఇక్కడి దీవుల్లో కొన్ని కనుమరుగయ్యే అవకాశం ఉంది. మాల్దీవులుే భారత్ , శ్రీలంకకు అత్యంత సమీపంలోనే ఉంది. ఇక్కడి అందాలను తిలకించేందుకు ఏడాది పొడవునా పర్యాటకులు తరలివస్తుంటారు. చుట్టూ నీలిరంగులో మెరిసిపోయే సముద్రపు హోయలు, ఇసుక తిన్నెలు, మూన్ నైట్స్, ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగాలతో అలరారుతోంది. మరో విశేషం ఏంటంటే పాన్ ఇండియా స్టార్లు ఈ ప్రాంతాన్నే ఎక్కువగా సందర్శిస్తున్నారు . అంతటితో ఆగకుండా ఫొటోలను ఇన్‌స్టాలో పెడుతూ సందడి చేస్తున్నారు.
హనీమూన్ కోసం కొత్త జంటలు ఇక్కడికే వస్తుంటారు
మాల్దీవుల జనాభా 5.6 లక్షలు కాగా, అధికారిక భాష 'ధివేహి', శ్రీలంక సింహళకు దగ్గరగా ఉంటుంది. ఇటీవలే ఇక్కడ ఇంగ్లిష్ మాట్లాడే స్థానికుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ేఈ దేశపు అధికార కరెన్సీ 'రూఫియా'తో పాటు US డాలర్లను ఉపయోగిస్తుంటారు. ఇక్కడి ఏకాంత ద్వీపాల్లో రిసార్టులుకు కొదవలేదు. కొత్త జంటలు హనీమూన్ కోసం, సెలబ్రిటీలు పర్యాటకం కోసం ఎగబడుతుంటారు. సముద్ర జీవ వైవిధ్యానికి మాల్దీవులు మారుపేరుగా నిలిచింది.అందుకే 2 వేల రకాల చేపలు, 200 జాతుల పగడపు దీవులను ఇక్కడ చూడొచ్చు. 'కాన్రాడ్ మాల్దీవ్స్ రంగాలీ ఐలాండ్' ఈ దేశంలోనే కొలువుంది. 16 అడుగుల లోతులో, రెండు అంతస్తుల్లో ఈ హోటల్ ను నిర్మించారు.ప్రపంచంలోనే తొలిసారిగా నీటి అడుగున నిర్మించిన హోటల్ ఇదే.
బహిరంగ ప్రదేశాల్లో ఆల్కహాల్ తాగడం నిషేధం
చేపలు, కొబ్బరి, బియ్యం, పండ్లను వినియోగించి మాల్దీవుల సంప్రదాయ వంటకాలను సిద్ధం చేస్తుంటారు. 'మాస్ హుని', 'గరుధియా', 'హెధికా' ఇక్కడి ప్రసిద్ధి వంటకాలు. 98 శాతం అక్షరాస్యత ఉన్న మల్దీవులు, బహిరంగ ప్రదేశాల్లో ఆల్కహాల్ తాగడంపై నిషేధం విధించింది. రిసార్టులు, పర్యాటక సంస్థలు మాత్రమే మద్యం అందిస్తాయి. మాల్దీవుల్లోని 'ధోనీస్' అంటే చేపల వేటకుప సంప్రదాయ పడవ ఇక్కడి స్పెషల్. ఒక ద్వీపం నుంచి మరో ద్వీపానికి వీటిలోనే టూరిస్టులు ప్రయాణిస్తారు. ఈ దీవుల్లోని నీటి అడుగున గుహలు ఉన్నాయి. వాటిల్లో రంగురంగుల చేపలను చూస్తూ ఈత కొట్టి అద్భుతమైన అనుభూతిని పొందుతారు. ఇక్కడి రైతులు సముద్రంలోని పాచిని సాగు చేస్తారు. విటమిట్ ఏ, సి లభించే దీన్ని ఆహారంగానూ స్వీకరించడం గమనార్హం.